Weekly Horoscope 14-20 August 2023:  ఈ వారం మేషం,ధనస్సు, మీన రాశులవారు మాటల విషయంలో సంయమనం పాటించాలి. మిగిలిన రాశుల ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి... 


మేష రాశి 
మేష రాశివారికి ఈ వారం రేసులా ఉంటుంది. ఎదురైన సమస్యలన్నింటినీ చేధించుకుంటూ ముందడుగేస్తారు. గడిచినవారంకన్నా ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికవ్యవహారాల్లో దూకుడు తగ్గించి నిర్ణయం తీసుకోవాలి. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులు నూతన ప్రయత్నాలు చేసేందుకు ఇదే మంచి సమయం. మొత్తంమీద ధైర్యంగా వ్యవహరించాల్సిన సమయం ఇది.


వృషభ రాశి
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఏ పనిలోనైనా దూకుడు తగదు. ఎవ్వరికీ అనవసర వాగ్ధానాలు చేయొద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునేముందు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించాలి. ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఈ వారంలో పెద్ద అడ్డంకులు,ఇబ్బందులు ఏమీలేవు కానీ కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు.


మిథున రాశి
ఈ వారం మీ కుటుంబంలో సామరస్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరిపేందుకు ప్లాన్ చేస్తారు. బంధాలు చీలిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ ఆత్మీయులు కలవడంతో మనసు ఆనందంగా ఉంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులకు శుభసమయం. 


Also Read: కన్యారాశిలో కుజుడి సంచారం, ఈ రాశులవారికి గుడ్ టైమ్!


కర్కాటక రాశి 
ఈ రాశివారు ఈ వారం మానసికంగా గందరగోళంగా ఉంటారు. విశ్వసనీయ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుని పనిలో ముందుకుసాగండి. అందర్నీ నమ్మేయవద్దు. వ్యాపారులు రెండు పడవలపై కాలు పెట్టొద్దు..సొంత వ్యాపారాన్ని చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు సంభాషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు ఈవారం ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగుల పనివిషయంలో రాజీ పడొద్దు..ఉన్నతాధికారులతో మాటపడే అవకాశం ఉంది. 


సింహ రాశి
 అవివాహితులకు ఈ వారం వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో-పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కోపాన్ని నివారించండి.  ముఖ్యంగా కుటుంబంలో చిన్న పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.


కన్యా రాశి  
కన్యారాశి వారికి హెచ్చు తగ్గులతో కూడిన వారం ఇది. ఎక్కడినుంచైనా శుభవార్త- ఇంకెక్కడి నుంచైనా చెడువార్త వినే అవకాశం ఉంది. కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ దూర ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. పెద్దగా ఇబ్బందులు లేవుకానీ జాగ్రత్తగా ఉండడం మంచిది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు - మాటతూలొద్దు.  కుటుంబంలో, కార్యాలయంలో అందరి సహకారం మీకు ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి


తులా రాశి 
ఈ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు, విందులతో సరదాగా గడుపుతారు. మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది.వ్యాపార వర్గాలకు కలిసొచ్చే సమయం ఇది. కుటుంబ జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. ఆరోగ్యంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని పూర్తవుతుంది.  పెద్ద పెద్ద నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదని గుర్తుంచుకుంటే మంచిది. 


Also Read: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!


వృశ్చిక రాశి 
వృశ్చిక రాశివారు ఈ వారం గందరగోళ స్థితిలో ఉంటారు. జీవితం మీ ముందు చాలా ఆప్షన్లు తీసుకొస్తుంది వాటిలోంచి ఓ నిర్ణయం ఫైనల్ చేసుకునేందుకు గందరగోళం చెందుతారు. ఒకేసారి ఉద్యోగ అవకాశాలు వచ్చే వస్తాయి...అయితే వీటిలో ఏది సరైనదో తేల్చుకునేందుకు  మీకు విశ్వసనీయమైన వ్యక్తి సలహా తీసుకోవడం ఉత్తమం..పది మంది నుంచి సలహాలు స్వీకరించవద్దు. కుటుంబ జీవితం బావుంటుంది. కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి. 


ధనస్సు రాశి
ఈ వారం ఈ రాశివారు బంధువులను, స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మీరు ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అందరి సలహాలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకోండి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలున్నాయి. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 


మకర రాశి
ఈ వారం మకర రాశివారు బిజీగా ఉంటారు. ఒకేసారి చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం లేదా వృత్తి - కుటుంబ జీవితం మధ్య సమతుల్యత ఏర్పరుచుకుంటే మానసికబాధ ఉండదు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన వ్యవహారం ఈ వారం పూర్తిచేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమికుల మధ్య పరస్పర వివాదాలుంటాయి కానీ పెళ్లికి సంబంధించి ముందడుగు పడుతుంది. ఆర్థికవిషయాలకు ఈ వారం అనుకూలం. 


కుంభ రాశి
కుంభ రాశివారు ఈ వారం ఆర్థికంగా విజయం సాధిస్తారు. గతవారం వెంటాడిన ఆర్థిక సమస్య ఇప్పుడు ఉండదు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికి అందుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత పనులకు కూడా వారం మంచిది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా , విస్తరించాలనుకుంటే ధైర్యంగా ముందడుగు వేయండి. ఉద్యోగులకు యజమానితో కొన్ని విభేదాలు ఉండొచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 


మీన రాశి 
మీన రాశివారికి ఈ వారం ఉత్తమమైనది. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనులు ఈ వారం పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెడతారు. కుటుంబ సమేతంగా శుభకార్యాలకు హాజరవుతారు.ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.   అనుకున్న ప్రకారం పనిజరగనప్పుడు మరోసారి ప్రయత్నించండి కానీ కోపం తెచ్చుకోవద్దు. సక్సెస్ విషయంలో మీకు తిరుగులేదు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.