Chanakya Neeti Telugu:  వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా విజయం సాధించాలంటే చాణక్య నీతి అన్ని కాలాల్లోనూ చక్కని మార్గదర్శి. తన శిష్యులకు చాణక్యుడు అప్పట్లో బోధించిన ప్రతి విషయం ఇప్పటికీ అనుసరణీయమే. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని విశ్వసించే ముందు లేదా స్నేహం చేసే ముందు ఈ నాలుగు విషయాలు పరిశీలించాలని సూచించాడు చాణక్యుడు. అవేంటంటే...


త్యాగ గుణం       


స్నేహం చేసినప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. త్యాగగుణం ఉన్నవారు ఇతరుల గురించి ముందుగా ఆలోచిస్తారు ఆ తర్వాత తమ స్వార్థం చూసుకుంటారు. పైగా ఎలాంటి సమయంలో అయనా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు అడగకుండానే సహాయం అందిస్తారు. ఇలాంటి స్నేహితుడు ఉండడం కన్నా అదృష్టం ఇంకేముంది.


Also Read: చాణక్య నీతి - ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌ ముగ్గురితో స్నేహం ప్రమాదకరం - మీ దోస్తులు ఇలాగే ఉన్నారా?


చరిత్ర తెలుసుకోండి            


పలకరించారు, మంచిగా మాట్లాడారు, మాటామాటా కలిపారని ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా భావించవద్దంటాడు ఆచార్య చాణక్యుడు. వారి స్వభావం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంచి స్వభావం ఉండే వ్యక్తుల నుంచి మీకు మంచి జరగకపోయినా చెడుమాత్రం జరగదు కానీ చెడుస్వభావం ఉండేవారు మీతో ఉంటే మీకు తెలియకుండానే వారి ప్రభావం మీపై పడుతుంది. మళ్లీ తేరుకోలేనంత లోతులోకి దిగిపోతారు. 


న‌మ్మ‌క‌స్తుడా, కాదా


కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, అబద్ధం ఇవన్నీ  వంటి చెడు లక్షణాలే కదా. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా అది పతనానికి దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తితో మీరు స్నేహం చేస్తే నష్టపోకతప్పదు. కోపం, స్వార్థం లేని వ్యక్తి అబద్ధం చెప్పని వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడు. జీవితంలో మీ ఆనందాన్ని, బాధను పంచుకునేది నమ్మకస్తుడైన స్నేహితుడు మాత్రమే. 


Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు


పనుల‌పై నిఘా        


ఓ వ్యక్తిని అంచనా వేయాలంటే వారిని చూడగానే తెలిసుకోవడం సాధ్యంకాదు. అలా వెంటనే అంచనా వేసేయ్యడం కూడా సరికాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ అంచనా తప్పుకావొచ్చు. అందుకే.. వాళ్లు ఎలాంటి వ్యక్తులు, వారి పరిచయాలేంటి,అలావాట్లు, ఆలోచనా విధానం ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం గమనించాలి. వారి ప్రతి అడుగుని గమనించాలి, చేసే పనులను గమనిస్తూ ఉండాలి (అనుమానంతో కాదు). తప్పుడు పనులకు పాల్పడేవారని నమ్మరాదు. సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి వెనుకాడరు. అందుకే సత్కార్యాలలో నిమగ్నమైన వ్యక్తితో స్నేహం చేయాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.