బీఆర్‌ఎస్ మాజీ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఎన్నో రోజుల నుంచి సాగుతున్న చేరిక ఎపిసోడ్‌కు ఇవాళ తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జూపల్లితోపాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరారు.
జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ ఠాక్రే, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.