Chanakya Neeti In Telugu : జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధించడానికైనా చాణక్య విధానం విజయవంతమైన, సమర్థమైన విధానంగా చెబుతారు. 2000 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా, ప్రజలు నేటికీ చాణక్యుడి సూత్రాలను అనుసరిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశాడని నమ్ముతారు. ఈ కారణంగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. చాణక్యుడు పెళ్లిచేసుకోలేదు కానీ భార్యను ఎలా సంతోషంగా ఉంచాలో మాత్రం చెప్పాడు. ఆ సూచనలు మీకోసం...
1. ఒంటె లక్షణాలను స్వీకరించండి
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒంటె వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలను అలవర్చుకోవాలి. ఒంటె గొప్ప గుణమేమిటంటే, అది ఎప్పుడూ సంతృప్తిని కలిగి ఉంటుంది. తన జీవితాన్ని తనకు కావలసిన విధంగా జీవిస్తుంది. ఒంటె ఏ ఆహారం తీసుకున్నా ఇష్టంగా తింటుంది. తిండి కోసం పెద్దగా అన్వేషించదు. భర్త తన భార్య శారీరక, మానసిక సంతృప్తిని జాగ్రత్తగా చూసుకోవాలని చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఆమె శారీరకంగా లేదా మానసికంగా ఏమి పొందాలనుకుంటోందో భర్త అర్థం చేసుకుని ఆమెకు అందించే ప్రయత్నం చేయాలి.
Also Read : మీరు ఇలా ఉంటే ఆనందం మీ సొంతం, కష్టం అనేదే దరి చేరదు!
2. ఒంటెలాంటి శౌర్యం
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో భర్తకు ఒంటెలా ధైర్యం ఉండాలని చెప్పాడు. ఎందుకంటే మీరు ఒంటె కంటే ధైర్యంగల జీవిని చూడలేరు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేనికీ భయపడకూడదు, వెనుకాడకూడదు. కుటుంబాన్ని ధైర్యంగా రక్షించే భర్తను భార్య ఎప్పుడూ ఇష్టపడుతుంది. అలాంటి వ్యక్తితో జీవితాంతం సంతోషంగా జీవించాలనుకుంటుంది.
3. నమ్మకమైన భర్త
ఆచార్య చాణక్యుడు విధేయతను గొప్ప ధర్మంగా అభివర్ణించాడు. చాణక్యుడి ప్రకారం, జంతువులలో ఒంటె అత్యంత నమ్మకమైన జంతువు. భార్య కూడా తన భర్త నుంచి విధేయతను ఎక్కువగా కోరుకుంటుంది. తన భర్త తనకు విధేయుడిగా ఉండాలని ఆమె ఆశిస్తుంది. ప్రతి భార్య ఎల్లప్పుడూ నమ్మకమైన భర్తను ప్రేమిస్తుంది, అతనితో సంతోషంగా ఉంటుంది. అటువంటి కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది.
Also Read : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి!
పై మూడు కారణాల వల్ల భర్త ఒంటెలా ఉండాలని చాణక్యుడు తన నీతిలో చెప్పాడు. భర్తకు ఒంటెలోని ఉన్న గుణాలు ఉంటే తన వైవాహిక జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అలాంటి భర్తను పొందిన భార్య అదృష్టవంతురాలు అవుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.