Ayyappa Swamy 18 steps: ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుని తరిస్తారు. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను  ‘పదునెట్టాంబడి’ అంటారు.  ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41  రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు. 18 మెట్లు ఎందుకంటే ...మణికంఠుడు...అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువైయ్యేందుకు  4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో  కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగసమాధిలోకి వెళ్లిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారంటారు. 


మెట్టుకో అస్త్రాన్ని విడిచిపెట్టిన అయ్యప్ప
అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటీ ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. 
18 అస్త్రాల పేర్లు
1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 
7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 
11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 
15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం


Also Read: కార్తీకమాసం ఎందుకంత ప్రత్యేకం, ఈ నెలరోజులూ ఏం చేయాలి - ఏం చేయకూడదు!


18 మెట్ల పేర్లు
1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 
7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 
13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 
16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక


18 మెట్లు అష్టాదశ దేవతలు
1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ
6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 
11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 
15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి


Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!


మెట్లపై ఏం వదిలేయాలంటే 
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు.  
మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి
తర్వాతి  8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని  విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి.
ఆ తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన
చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.


శబరిగిరి చుట్టూ 18 కొండలు
1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల


ఓ మనిషికి  ఉండాల్సిన లక్షణాలు, వదిలేయాల్సిన దుర్గుణాల వరకూ అన్నింటికీ ఈ 18 ఓ సంకేతం. అందుకే  18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామి దర్శనం కలుగుతుంది.