Ayyappa Suprabhatam In Telugu: అయ్యప్ప సుప్రభాతం  స్వామిని కీర్తిస్తూ తెల్లవారు ఝామున  పాడే భక్తి గీతం. ఈ స్తోత్రం శ్రీ అయ్యప్ప స్వామి స్వభావం, శక్తి ,యు అనుగ్రహాన్ని స్తుతిస్తుంది.  ఈ స్తోత్రం అయ్యప్ప స్వామి యొక్క అపారమైన శక్తి, కరుణ , అనుగ్రహాన్ని ప్రశంసిస్తూ ఉంటుంది. అయ్యప్ప మాల ధరించిన భక్తులు తమ హృదయాలను అయ్యప్ప స్వామికి సమర్పించుకుంటూ సుప్రభాతంతో రోజు ప్రారంభిస్తారు.


Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
 
శివ పుత్రుడు, విష్ణు పుత్రుడు, శక్తి పుత్రుడు అయిన శ్రీ అయ్యప్ప స్వామి లోకాన్ని రక్షించేందుకు వచ్చాడని భక్తుల విశ్వాసం. అందుకే ఏడాదికి 41 రోజుల పాటూ మండల దీక్ష చేసి స్వామి సన్నిధికి వెళ్లి శబరిమల మకర జ్యోతిని దర్శించుకుంటారు. 



  • అయ్యప్ప సుప్రభాతం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన పెంచుతుంది. ఈ స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే తమలో దైవక శక్తిని గుర్తిస్తారు

  • ఉరకల పరుగుల జీవన విధానంలో ఎదుర్కొనే ఒత్తిడి నుంచి ఉపశమనం ప్రసాదిస్తుంది అయ్యప్ప సుప్రభాతం

  • అయ్యప్ప సుప్రభాతం పఠించడం లేదంటే వినడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం

  • ఈ సుప్రభాతం ఆత్మను శుద్ధిచేస స్వామిపై భక్తిని పెంచుతుంది. నిత్యం సుప్రభాతం పఠించేవారు స్వామికి చేరువవుతారు

  • అయ్యప్ప సుప్రభాతంతో ప్రారంభించే ప్రతి రోజు శుభప్రదంగా ఉంటుందని భక్తుల నమ్మకం

  • సుప్రభాతాన్ని నిత్యం పఠించడం వల్ల భక్తులు తమ జీవితంలోని అన్ని సమస్యలను దైవిక దృష్టితో చూడగలుగుతారు, జీవతంపై ఆశావాద దృక్పధాన్ని కల్పిస్తుంది

  • అయ్యప్ప సుప్రభాతం భక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని..రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు.


 Also Read: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!


Ayyappa Suprabhatam Telugu


అయ్యప్ప సుప్రభాతం తెలుగు
సురాసురధిత దివ్య పాదుకం |
చరాచరంత స్థిత భూత నాయకమ్ ||
విరాజమాన నానామది దేశికమ్ |
వరాభయాలంకృత పనిమాశ్రయే ||  


వారసనస్థం మణి కాంత ముజ్వలం |
కరంభుజో పథ విభూతి భూషణమ్ ||
స్మరాయుధకార మూఢర విగ్రహం |
స్మరామి శాస్త్రమ్ అనాధ రక్షకమ్ ||  


స్మరాధి సంగీత రసానువర్థనం |
స్వరాజ కోలాహల దివ్య కీర్తనం ||
ధారా ధరేంద్రోపరి నిత్య నర్తనం |
కిరాత మూర్తిం కలయే మహద్ధనం || 


నిరామయానంద ధయా పయోన్నిధిం |
పరాత్పరం పావన భక్త సేవాధిమ్ ||
రాధి విచేధన వైద్యుతాకృతిమ్ |
హరీశ భాగ్యాత్మజ మాశ్రయామ్యహం || 


హరీంద్ర మాతంగ తురంగమాసనం |
హరేంద్ర భస్మాసన శంకరాత్మకం ||
కిరీట హారంగధ కంకణోజ్వలం |
పురాతనం భూతపతిం భజామ్యహమ్ || 


వరప్రధాం విశ్వా వసీకృత్యాకృతీమ్ |
సుర ప్రధానం శబరి గిరీశ్వరమ్ ||
ఉరుప్రభం కోటి దివాకర ప్రభం |
గురుం భజేహం కుల దైవతం సదా || 


ఆరణ్య సార్ధూల మృగాధి మోధకం |
ఆరణ్య వర్ణం జడేక నాయకమ్ ||
తరుణ్య సమత్ నిలయం సనాతనమ్ |
కారుణ్య మూర్తిం కలయే దివానీసం ||  


దురంత తప త్రయ పాప మోచకం |
నిరంతరానంద గతి ప్రధాయకం ||
పరం తాపం పాండ్యాన్యపాల బాలకం |
చిరంథానాం భూతపతిం తమశ్రయే ||  


వరిష్టమీశం శబరారీ గిరేశ్వరో |
వరిష్టం ఇష్ట పదం ఇష్ట దైవతం ||
అరిష్ట దుష్ గ్రహం శాంతిధామ్ |
గరిష్ట మష్ట పద వేత్రం ఆశ్రయే ||  


సరోజ శంఖాధి గాధా విరజితం |
కరంభుజానేక మహో జ్వాలాయుధం ||
శిరస్థ మాల్యం శిఖి పించ శేఖరం |
పురస్థితం భూతపతిం సమాశ్రయే ||


ఇతి శ్రీ అయ్యప్ప సుప్రభాతం సంపూర్ణం ||



Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!