మేష రాశి


ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. ఇంటి అలంకరణపై శ్రద్ధ చూపుతారు. కష్టపడి పని చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగ పరంగా అదృష్టవంతులు అవుతారు. మీరు వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. కుటుంబ ఒత్తిడులు దూరమవుతాయి. విద్యార్థులకు విద్యలో మంచి అవకాశాలు లభిస్తాయి.


వృషభ రాశి


వృషభ రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలను చర్చిస్తారు. చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీ అభిప్రాయాలను రుద్దొద్దు. ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు.


మిథున రాశి


మిథున రాశి వారు కార్యాలయంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో నిర్లక్ష్యం పెద్ద సమస్యలను కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 


Also Read: రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!


కర్కాటక రాశి


ఈ రాశివారి ఇమేజ్ చెడగొట్టడంలో కొందరు బిజీగా ఉంటారు. చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. మీరు అనియంత్రిత ఆహారాన్ని నివారించాలి. కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించే ముందు కచ్చితంగా నిపుణుల నుంచి సలహా తీసుకోండి. కార్యాలయంలో బాధ్యతల ఒత్తిడి ఉంటుంది


సింహ రాశి


సింహ రాశి వారి జీవనశైలి చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన సమావేశానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈ రోజు గొప్ప రోజు. అదృష్టవంతులు అవుతారు.


కన్యా రాశి 


ఈ రోజు మీ కెరీర్‌కు సంబంధించి చాలా ఎంపికలు ఉంటాయి. కొత్త జానర్ నేర్చుకుంటారు. ప్రయాణాలు చేయాల్సిన  అవసరం వస్తుంది.  విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి.


Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!


తులా రాశి


కార్యాలయంలో ప్రయోజనాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభఫలితాలున్నాయి.  నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వింటారు. పిల్లలు కెరీర్ విషయంలో కొంచెం అయోమయానికి గురవుతారు. ప్రేమ జంటతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


వృశ్చిక రాశి


ఈరోజు ప్రతికూలతకు దూరంగా ఉండండి. అయాచిత సలహాలు ఇవ్వడం వల్ల వివాదం రావచ్చు. అనుమానాలు కారణంగా మనశ్సాంతికి దూరమవుతారు. జీవితభాగస్వామిని గౌరవించండి. వివాదాలకు దూరంగా ఉండండి. 


Also Read:  మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!


ధనస్సు రాశి


ఈ రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. స్నేహితులను కలిసే అవకాశం ఉంది.  కోర్టు కేసులలో మీకు అనుకూలంగా నిర్ణయాలు రావచ్చు.మీ పనిని మీరు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. 


మకర రాశి


మకర రాశి వారు వ్యాపార ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.  కొత్త అవకాశాలు పొందుతారు.  సంబంధాల మధ్య పెరుగుతున్న దూరం తగ్గవచ్చు. మీరు మీ అర్హతను బట్టి పనిని పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం అవుతాయి. 


కుంభ రాశి 


కుంభరాశి వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుంది. రహస్య జ్ఞానం వైపు ఆకర్షితులవుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.  మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవలసి ఉంటుంది. చిన్న విషయాలకు త్వరిత ప్రతిచర్య మీకు హాని కలిగిస్తుంది. 


మీన రాశి 


ఈ రాశివారు ఉద్యోగంలో బదిలీ కావొచ్చు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నించవద్దు. కొన్ని కారణాలవల్ల డల్ గా ఉంటారు. ఏదో విషయంలో ఈ రోజు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.