Garuda puranam: గరుడ పురాణాన్ని వైష్ణవ శాఖ పవిత్ర గ్రంథం అని కూడా అంటారు. ఈ పుస్తకం ఒక వ్యక్తి  పుట్టుక, మరణం, స్వర్గం, నరకం గురించి వివరిస్తుంది. దీనితో పాటు, వ్యక్తి చర్యలు కూడా వివరంగా ప్రస్తావించారు. అంతే కాదు, ఒక వ్యక్తి పునర్జన్మ గురించి కూడా వెల్ల‌డిస్తుంది. మరణం తర్వాత ఆత్మ ఎలా, ఏ రూపంలో పుడుతుందో గరుడ పురాణంలో వివరించారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన కర్మల ఆధారంగా మరణానంతర జన్మ రూపం నిర్ణయం జరుగుతుంది. అంటే ఈ జన్మలోని కర్మల ఆధారంగానే వచ్చే జన్మ రహస్యం తెలుస్తుంది. గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుందాం. 


మహిళ హత్య          


స్త్రీని చంపినవాడు లేదా స్త్రీకి గర్భస్రావం చేసినవాడు నరకయాతన అనుభవించవలసి ఉంటుందని ఆ వ్యక్తి తదుపరి జన్మ చండాల జన్మ అని గరుడ పురాణం పేర్కొంది.


Also Read : చనిపోయిన వ్యక్తి కోసం ఇంట్లో గరుడ పురాణం చదవాలా?


తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉంటే


గరుడ పురాణం ప్రకారం, తల్లిదండ్రులను లేదా పిల్లలను ఇష్టపడని వారు తదుపరి జన్మలో భూమిపై పుట్టలేరు. భూమ్మీద పుట్టాలంటే తల్లి కడుపులో ఉండగానే చనిపోతారు.


మహిళలపై దోపిడీ


గరుడ పురాణం ప్రకారం, స్త్రీని దోపిడి లేదా హింసించే వ్యక్తి తన తదుపరి జన్మలో భయంకరమైన రోగాల బారిన పడి తన జీవితాన్ని శారీరక బాధతో గడుపుతాడు. ఎప్పటి నుంచో సమాజంలో స్త్రీలకు గౌరవం దక్కడానికి ఇదొక కారణం. మరోవైపు తెలియని స్త్రీతో అంటే పరస్త్రీతో సంబంధాన్ని పెంచుకునే పురుషుడు వచ్చే జన్మలో బలహీనుడవుతాడు.


గురువుకు అవమానం             


గురువును గౌరవించని వారికి మరణానంతరం నరకంలో స్థానం లభిస్తుంది. అలాగే ఇలాంటి వారు వచ్చే జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. ఎందుకంటే గ్రంధాలలో గురువును భగవంతునితో సమానంగా పరిగణిస్తారు.


మోసాలు       


గరుడ పురాణం ప్రకారం, తమ జీవితంలో మోసపూరిత మార్గాన్ని అనుసరించిన వారు, ఇతరులను మోసం చేసేవారు వారి తదుపరి జన్మలో గుడ్లగూబ రూపంలో పుడతారు. అమాయకులపై తప్పుడు సాక్ష్యం చెప్పే వారు వచ్చే జన్మలో అంధత్వానికి గురవుతారు.


Also Read : పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు


హత్య, దొంగతనం     


గరుడ పురాణం ప్రకారం, తమ జీవితకాలంలో ఎవరినైనా చంపడం, దోచుకోవడం లేదా జంతువులను వేటాడడం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు తమ తదుపరి జన్మలో కసాయి చేతికి చిక్కే మేకగా జ‌న్మిస్తారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.