Garuda Purana: మరణించిన ఆత్మకు తర్పణం చేసిన తర్వాత కూడా, కొన్నిసార్లు ఆత్మలు విముక్తి లేకుండా తిరుగుతాయి. కాబట్టి గరుడ పురాణం లోకం నుంచి వెళ్లిపోయిన ఆత్మకు ముక్తి లేదా మోక్షాన్ని ఇవ్వడానికి పఠిస్తారు. గరుడ పురాణం చదివితే లాభమేంటి..? గరుడ పురాణానికి నిష్క్రమించిన ఆత్మ మధ్య సంబంధం ఏమిటి?


గరుడ పురాణంలో, మరణానికి ముందు.. తరువాత పరిస్థితి వివరించారు. అందుకే చనిపోయిన వారి కోసం ఈ పురాణం ప‌ఠిస్తారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఒకసారి, గరుడుడు విష్ణువును జీవుల మరణం, యమలోక ప్రయాణం, నరకం, మోక్షం గురించి అనేక రహస్య,  ఆధ్యాత్మిక ప్రశ్నలు అడిగాడు. గ‌రుత్మంతుడి ప్రశ్నలకు శ్రీ‌విష్ణువు వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రశ్న-సమాధానాల పరంపరే గరుడ పురాణం.


గరుడ పురాణం ఎందుకు చదవాలి?


మరణించిన వ్యక్తి తన ప్రియమైనవారిలో 13 రోజులు ఉంటాడు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే స్వర్గం, నరకం, మోక్షం, పాతాళం, పతనం గురించి మృతుడికి తెలుస్తుంది.


Also Read : చనిపోయిన వ్యక్తికి చెందిన ఈ మూడు వస్తువులు వాడితే, ఇక అంతే!


ఆత్మలు పునర్జన్మ పొందేందుకు ఒక మార్గం


గరుడ పురాణం ద్వారా భ‌విష్య‌త్‌ ప్రయాణంలో అతను/ఆమె ఎదుర్కోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకుంటారు. గ‌రుడ పురాణం చ‌ద‌వ‌డం ద్వారా ఆత్మ తన కుటుంబం ప్రేమను పొందుతుంది.


స్వర్గ-నరక ప్రాప్తి


గరుడ పురాణాన్ని చదవడం ద్వారా, మ‌ర‌ణించిన‌ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఎలాంటి మంచి పనులు, చెడు పనులు చేశారో అతని బంధువులకు తెలుస్తుంది. బంధుమిత్రులంతా పుణ్యం చేశాడని అనుకుంటే ఆత్మకు మోక్షం కలుగుతుంది. తదుపరి ప్రయాణానికి మార్గం దొరుకుతుంది.


మోక్షం


గరుడ పురాణం మంచి పనులను ప్రేరేపిస్తుంది. సత్కర్మలు, దయ ద్వారా మాత్రమే మోక్షం, ముక్తి లభిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన పాపాలను బట్టి స్వర్గ నరకాలు నిర్ణయమ‌వుతాయి.


గరుడ పురాణంలో శిక్ష


గరుడ పురాణంలో, ఒక వ్యక్తి చర్యల ఆధారంగా వివిధ శిక్షలు కనిపిస్తాయి. గరుడ పురాణం ప్రకారం, శ్రీ‌మ‌హా విష్ణువు ఒక వ్యక్తి మోక్షం వైపు నడ‌వాలంటే, ముక్తిని పొందాలంటే జీవితకాలంలో సత్కర్మలు చేయాల‌ని గ‌రుత్మంతుడికి చెప్పిన స‌మాధానంలో వివ‌రించాడు.


Also Read : ఈ గుణాలున్న భర్త ఉంటే భార్య అదృష్టవంతురాలు


గరుడ పురాణం - ఆత్మజ్ఞానం


గరుడ పురాణంలో మన జీవితానికి సంబంధించిన అనేక రహస్య విషయాలు వివ‌రించారు. వ్యక్తి గురించి తెలుసుకోవ‌డంతో పాటు ఆత్మజ్ఞానం గరుడ పురాణం ప్రధాన ఇతివృత్తం. గరుడ పురాణంలోని పంతొమ్మిది వేల శ్లోకాలలో, ఏడు వేల శ్లోకాలు జ్ఞానం, ధర్మం, నీతి, రహస్యం, ఆచరణాత్మక జీవితం, స్వీయ, స్వర్గం, నరకం మరియు ఇతర ప్రపంచాలను వివరిస్తాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించగలరు.