RaghuRama Krishna Raju Sensational Comments over TDP and Janasena Alliance: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అనే అంశం గత కొంతకాలం నుంచి తెరమీదకు వస్తూనే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్‌సీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జలతో పాటు ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కలిసి పోటీ (TDP and Janasena Alliance) చేస్తే  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోతారని వ్యాఖ్యానించారు.


అధికార వైఎస్సార్‌సీపీని ఓడించేందుకు వ్యతిరేక శక్తులం ఏకం అవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల అన్నారు. అసలే జనసేన పార్టీ బీజేపీతోనో, లేక టీడీపీతోనో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుందని, ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైఎస్సార్‌సీపీ కచ్చితంగా ఓడిపోతుందని, ఇందులో ఏ అనుమానం వద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాట చెబుతూనే.. ఏపీ ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు మళ్లీ ఓట్లేస్తారని, లేకపోతే పరిస్థితి మారుతుందన్నారు.


ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని గద్దె దింపడానికి చూస్తారని, కానీ విపక్షాల ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని రఘురామ గుర్తుచేశారు. అధికారంలో లేకున్నా చంద్రబాబు సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలు భారీ సంఖ్యలోనే తరలివస్తారు. అయితే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, మనమంతా ఏకమై ముందుకు సాగాలని, ఏ త్యాగాలకైనా తాను సిద్ధమని చంద్రబాబు చెప్పడాన్ని చూశామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూసి వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. పరిపాలన బాగుంటే తమకు మరోసారి అధికారం దక్కుతుందని, లేకపోతే ఏమైనా జరగొచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ చెప్పింది మాత్రం ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉండాలని, వైఎస్సార్‌సీపీ ఓట్లు చీలకూడదని చెప్పడం ఏపీ రాజకీయాల్లో హీటు పెంచుతున్నాయనడానికి రఘురామ వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.


ఇంతకీ సజ్జల ఏమన్నారంటే..
" ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నాం" అని సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పలు రకాలుగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలయినా పార్లమెంట్ ఎన్నికలయినా రెండేళ్ల తర్వాతే ఉన్నాయి. మరి ఏడాదిలో అని ఎందుకన్నారనేదే ఆ చర్చకు కారణం. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విస్తృతమైన చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ రాజకీయ నిర్ణయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సజ్జల నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది. సజ్జల కామెంట్ చేసిన మరుసటిరోజే పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. 


Also Read: Sajjala On Elections : ఏడాదిలో అసెంబ్లీ, రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు - సజ్జల చెప్పింది ఇదేనా ? 


Also Read: Cyclone Asani: ఏపీ, ఒడిశాలకు తుపాను ముప్పు - ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, మే 10న తీరం దాటే అవకాశం