Perni nani :   బావ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బాలయ్యకు మరో అవకాశం వచ్చిందని మాజీ మంత్రి పేర్నినాని అన్‌స్టాపబుల్ షో పై వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌తో అన్‌స్టాపబుల్ షో షూటింగ్ జరగడంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అన్ స్టాబుల్ షో లో అందరికి పే మెంట్ లేనని పేర్ని నాని చెప్పుకొచ్చారు.  ఎవరి డైలాగులు వారికి ముందుగానే రాసిస్తారని అన్నారు.  అంతా డబ్బు వ్యవహారం అని పేర్కోన్నారు.జనానికి ఎంటర్ టైన్ మెంట్ షో అయితే అందులో పాల్గోనే వారికి పేమెంట్ షో అని వ్యాఖ్యానించారు. 


చంద్రబాబు తప్పులను కప్పి పుచ్చేందుకు  బాలయ్యకు మరో అవకాశం 


చంద్రబాబు తప్పులను కప్పి పుచ్చేందుకు బాలయ్యకు  ఔరంగ జేబుకు వచ్చినట్లు మరో అవకాశం దక్కిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.  ఎన్టీఆర్ ను కూలదోసిన వ్యవహరాన్ని మసిపూసి మారేడు కాయ చేయటానికి, బావ తప్పులను సరి చేయటానికి, బావ మద్దతు దారులతో మాట్లాడటానికి అవకాశం వచ్చిందని అన్నారు. బావతో తిరిగిన వ్యక్తి, బావమరిదితో తిరగటం పెద్ద విషయం కాదని పవన్ ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అన్ స్టాపబుల్ కేవలం ఎంటర్ టైన్ మెంట్ షో నే నని అన్నారు. ఆర్దిక లావాదేవీల్లో బ్లాక్ , వైట్ రెండూ ఉంటాయని.. అవసరం అయితే ఐటీ రిటర్న్ లలో అసలు విషయాలు వెలుగు లోకి వస్తాయని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.  రేటింగ్ ప్రకారం ఎవరి వాటాలు, లాభాలు వారు చూసుకుంటారన్నారు.  అల్లు అరవింద్ రూపంలో బాలయ్యకు ఇలాంటి అవకాశం వచ్చిందని, అన్ స్టాపబుల్ కు వచ్చిన ఆదరణ కారణంగా ఎవరి అభిప్రాయాలు వారు పంచుకోవటం తో పాటుగా, వీటిని రాజకీయాలకు దగ్గర చేస్తున్నారని పేర్ని నాని  విమర్శించారు. 


వారం వారం అడ్డగాడిద వచ్చి విమర్శలు చేస్తూంటారు ! 


ఏపీలో సీఎం జగన్ ను తిట్టటానికి వారం వారం ఒక అడ్డగాడిద వస్తుందని పవన్ ను ఉద్దేశించి పేర్నినాని అన్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్య  పరిరక్షణ గురించి ప్రతిపక్షాలు మట్లాడటం దారుణమని అన్నారు.ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయటం ఎంటని ప్రశ్నించారు. ముసుగు  తీసి  బయటకు వచ్చి  జగన్  ను  ఎదుర్కోవడం  కష్టమని  చెప్పండని సలహా ఇచ్చారు. పవన్ వారం వారం వచ్చి జగన్ ను తిట్టి వెళుతున్నారని అలాంటి వ్యక్తి సీఎం అభ్యర్దిగా ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.  పవన్ చంద్రబాబు కలసే పని చేస్తున్నారనేందుకు అనేకమయిన విషయాలు కనిపిస్తున్నాయని,ఇంక అంతకన్నా సాక్ష్యాలు ఎం కావాలని పేర్ని నాని ప్రశ్నించారు.


కాపు నేతల్లో ముఖ్యమంత్రి అయ్యే లక్షాణాలు లేవా ? 


కాపులు  ముఖ్యమంత్రి  అవ్వడం  తప్పు  కాదని అత్యాశ కూడా కాదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కులం  నుంచి  మంచి  నాయకులు  వస్తే  తప్పు  కాదన్నారు. సమాజాన్ని  ప్రేరేపితం  చేసే  వ్యక్తి  వస్తే  ఒకే అని అన్నారు. అయితే అలాంటి లక్షణాలు జగన్ కు మాత్రమే ఉన్నాయని,అలాంటి నాయకులతోనే ప్రజలు ఉంటారని చెప్పారు.కేవలం కాపు కులానికి సంబందించిన వ్యవహరాలు పైనే పని చేస్తే ముఖ్యమంత్రి కాలేరని తెలిపారు.పవన్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటుంటే,  పవన్ కళ్యాణ్  కాపులను  పొట్లం  కట్టి  చంద్రబాబు  చేతిలో  పెడుతున్నాడు  కదా అని విమర్శించారు. 
 
చంద్రబాబు “నాయుడు” కాపు కాదు...!


చంద్రబాబు నాయుడు కాపులు కాదని ఆయన కమ్మవారు అని  పేర్ని నాని వ్యాఖ్యానించారు.కాపుల్లో సీఎం అభ్యర్ది ఎవరు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు పేరు లో నాయుడు ఉంది కాబట్టి ఆయన కాపు అనుకుంటున్నారేమో...ఆయన కమ్మవారని పేర్ని వ్యాఖ్యానించారు.కాపు ముఖ్యమంత్రి అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్ని  నాని ఈ కామెంట్స్ చేశారు.