Will the Congress alliance keep Jagan away :  తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లుగా రాజకీయం మారుతోంది. టీటీడీ బోర్డు స్వతంత్రంగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాలు బోర్డే చూసుకుంటుంది... అని స్వయంగా సీఎం జగన్ ప్రెస్ మీట్‌లో చెప్పినా.. నెయ్యి కల్తీ వ్యవహారమంతా  గత ప్రభుత్వం తప్పే అన్నట్లుగా ఇతర పార్టీలన్నీ ప్రొజెక్ట్ చేశాయి. వైసీపీ దాన్ని తిప్పికొట్టలేకపోయింది. తప్పు చేయలేదని బలంగా వాదించలేకపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మాత్రం అంటున్నారు. ఈ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లెక్కి ఎవరూ ధర్నాలు  చేయడం లేదు కానీ..ఉత్తరాదిలో మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. 


ఉత్తరాదిలో జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు


హిందూత్వ రాజకీయాలు దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిన ఎక్కువగా ఉంటాయి. తిరుమల అనేది ఉత్తరాది హిందూ భక్తులకు  కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశం. అలాంటి హిందూ ఆలయంలో.. అపచారం జరిగిందని తెలిసిన తర్వాత  భారతీయ జనతా పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. దీంతో సహజంగానే హిందూత్వ వాదులు  రంగంలోకి దిగిపోయారు. యూపీ, మధ్యప్రదేశ్ వంటి చోట్ల నిరసనలు జరిగాయి.  ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా జగన్ ఇేమజ్ హిందూవ్యతిరేకిగా మారిపోయింది. అదే సమయంలో జగన్ క్రిస్టియానిటీ,  ఆయన కుటుంబ నేపధ్యం,  ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన  మత  మార్పిళ్లు ఇలా ప్రతీ అంశాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేశారు. దీంతో జగన్ హిందూ వ్యతిరేకగా ఉత్తరాదిన మారిపోయారు. 


తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు గుర్తించాం, కల్తీ జరిగింది : టీటీడీ ఈవో శ్యామలరావు సంచలనం


నార్త్‌లో జరిగిన  పరిణామాలతో జగన్‌కు నష్టమేనా  ?


వైసీపీ ఇప్పుడు ఏపీ దాటి ఎక్కడా పోటీ చేయడం లేదు. కనీసం తెలంగాణలో కూడా పోటీ చేయడం లేదు. మరి నార్త్ లో జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పరిణామాలు జరిగితే  ఆయనకు ఏంటి..బిందాస్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో పోటీ చేసి.. ఫలితాలు సాధించాల్సినది ఏపీలోనే అయినా దేశవ్యాప్తంగా జగన్ ఇమేజ్ కూడా ముఖ్యమే. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ కూటమిలో భాగంగా మారిపోవాల్సి ఉంటుంది. ఇటీవల ఢిల్లీలో ధర్నా  చేసినప్పుడు ఆయన ఇండియా కూటమి పార్టీల మద్దతు కూడగట్టగలిగారు దానికి కారణం  ఆయనకు  జాతీయ స్థాయిలో ఎలాంటి ఇమేజ్ లేకపోవడమే . కానీ ఇప్పుడు ఆయనపై హిందూ వ్యతిరేక ముద్ర పడింది. ఇప్పుడు ఆయన ఢిల్లీ లో ఏదైనా  మద్దతు  కోసం రాజకీయ పార్టీల వద్దకు  వెళ్తే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. 



Also Read: Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే




తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం పూర్తిగా వైఎస్ఆర్‌సీపీ మీద పడిపోయింది. నాటి టీటీడీ బోర్డుపై ఎక్కువ బాధ్యత పెట్టేసి ఉంటే.. పూర్తిగా జరిగిన తప్పిదం అంతా  వైసీపీ మీద పడి ఉండేది కాదు. కానీ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. జగన్ పాలనలోనే జరిగిందని ఆరోపించారు. దానికి తగ్గట్లగానే రాజకీయం నడిచింది. వైసీపీ కేంద్రంగానే వివాదం రాజుకుంది. ఆ ట్రాప్ లో వైసీపీ పడిపోయింది. చివరికి రాహుల్ గాంధీ కూడా లడ్డూ వివాదంపై స్పందించారు. ఆయన స్పందన ప్రకారం చూసిన ఈ విషయంలో  జగన్ మోహన్ రెడ్డికి వస్తన్న వ్యతిరేకత వల్ల.. కాంగ్రెస్ కూటమి వైపు  జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడల్లా వెళ్లడం కష్టమే. బీజేపీతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండే అవకాశాలు ఉన్నందున... కాంగ్రెస్ వైపు వెళ్లడం మంచిదనుకున్న వైసీపీకి ప్రస్తుత వివాదం చిక్కుల్లోకి  నెట్టిందని  అనుకోవచ్చంటున్నారు.