3 lakhs of Srivari Laddu Prasad is prepared per day : శ్రీ వెంకటేశ్వర స్వామి  లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టిస్తోంది. కోట్లాది  మంది హిందువుల మనోభావాలతో ముడి పడిన అంశం కావడంతో లడ్డూ ప్రత్యేకతలపై విస్తృత చర్చ జరుగుతోంది. శ్రీవారి లడ్డూ అత్యంత పవిత్రమైనది. లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో మరెవరూ అలాంటి లడ్డూరు తయారు చేయరు.. చేయలేరు కూడా. 


2014లో GI స్టేటస్


తిరుమల లడ్డూకు 2014లో జీఐ స్టేటస్ వచ్చింది. జియో గ్రాఫికల్ ఐడెంటిఫికేన్ ( భౌగోళిక గుర్తింపు )  ప్రపంచ వాణిజ్య సంస్థ ఇస్తుంది.  తమ సభ్యదేశాలు తమ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆహార ఉత్పత్తులు, చేనేత కళలు, వస్తువులు, వంటలకు భౌగోళిక గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.  ఒక ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన  వాటికి భౌగోళిక గుర్తింపు జారీ చేస్తారు. జీఐ గుర్తింపు పొందిన వస్తువులు, ఆహార పదార్థాలను ఆయా గుర్తింపు పొందిన సం స్థలు, వ్యక్తులు మాత్రమే  వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు వినియోగిస్తే సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే తిరుమల లడ్డూను టీటీడీ తప్ప మరెవరూ తయారు చేసే అవకాశం లేదు. 


తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు


రోజూకు 3 లక్షల లడ్డూలు - రూ. 500 కోట్ల టర్నోవర్                         


తిరుమల  లడ్డూనూ తిరులకు వచ్చే ప్రతి భక్తుడు తన బంధు మిత్రుల కోసం.. కార్యాలయాల్లో సహచరుల కోసం తీసుకెళ్తూంటారు. అందుకే  ప్రతి భక్తుడు సగటున నాలుగైదు లడ్డూలు తీసుకుంటాడు. ఇలా భక్తులు కొండపైకి యాభై, అరవై వేల మంది వచ్చినా రోజుకు మూడు లక్షల లడ్డూలను  పోటులో తయారు చేస్తారు. వాటిని భక్తులకు పంపిణీ చేస్తారు. అందు వల్ల పోటులో  అత్యంత నిష్టతో తయారీదారులు పని చేస్తూంటారు. తిరుమలలో ఒక్క లడ్డూ టర్నోవరే దాదాపుగా ఐదు వందల కోట్ల వరకూ ఉంటుంది. దర్శనం చేసుకునే ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ ఇస్తారు. తక్కువ ధరకు ఇస్తారు. అదనంగా కావాలంటే ఒక్కో లడ్డూకు రూ. యాభై చెల్లించాల్సి ఉంటుంది.                    


బూందీగా ప్రారంభమైన తిరుపతి లడ్డూ చరిత్ర తెలుసా? మొదట్లో 8 నాణేలకే అమ్మకం!


ఖచ్చితంగా 175 గ్రాముల బరువు


తిరుపతి లడ్డూ  బరువు ఖచ్చితంగా 175 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డూ నాణ్యతపై వయసు మళ్లిన వారు చెబుతారు. తిరుపతికి రెగ్యులర్ గా వెళ్లేవారిలో చాలా మంది పెద్దలు లడ్డూ నాణ్యతపై ఎంతో గొప్పగా చెబుతారు. అయితే రాను రాను నాణ్యత తగ్గిపోతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తూంటారు. ఇప్పుడు లడ్డూ నెయ్యిని ఏకంగా కల్తీగా తయారు చేస్తున్నారని తేలడంతో.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.