అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించిన ఘటన.. అనంతర వివాదాల్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్ర బాబు , ఆయన బృందం పది తప్పులు చేశారని ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. చంద్రబాబు నాయుడు, బొండా ఉమలకు మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులకు వారు స్పందించలేదు. వారు తమ ముందు హాజరవుతారేమోనని వాసిరెడ్డి పద్మ ఉదయమే ఆఫీసుకు వచ్చారు. కానీ చంద్రబాబు, బొండా ఉమ రాలేదు. తెలుగు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ .. చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పది తప్పులు చేశారని లెక్క చెప్పారు.
ఏపీ మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వివాదంతో రచ్చరచ్చ
మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం, రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం, మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం, నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వెళ్లం, ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అడ్డుకోవడం, ఆరో తప్పు: ఏపీ మహిళా కమిషన్‌ను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం, ఏడో తప్పు: బెదిరించడం, విధులను అడ్డుకోవడం, ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా బెదిరించడం, తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం, పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ప్రకటించారు.
విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు - సీఎం జగన్‌తో భేటీ తర్వాత కీలక మార్పులు
తాము నోటీసులు ఇస్తే టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. అంతకు ముందు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు, వంగలపూడి అనిత ముట్టడించడానికి యత్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి టీడీపీ మహిళా నేతలు.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చాంబర్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అంద జేశారు. మొత్తంగా ఏపీ మహిళా కమిషన్ అసలు విషయాలు వదలి.. కమిషన్ ను రాజకీయాలకు కోసం వాడుకుంటోందన్న విమర్శలను టీడీపీ నేతలు చేస్తున్నారు.