తెలంగాణ గవర్నర్ తమిళిశై సౌందరరాజన్‌కు.. ప్రభుత్వానికి మధ్య వివాదం ముదిరిపోతోంది. గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదని టీఆర్ఎస్ అంటోంది. గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడటం సరికాదు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని సూచించారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంకు, మంత్రులకు తెలుసన్నారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్‌లో మరో వివాదం- ముగ్గురు లీడర్లపై అధిష్ఠానానికి ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ప్రధాని, కేంద్రమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారని తలసాని ప్రశ్నించారు. పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేనని బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపలేదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో కేసీఆర్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. డ్రగ్స్ దందాలో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దని సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు.
కొత్తగూడెం ఛైర్ పర్సన్ కు ఘోర అవమానం, బైక్ తో ఢీకొట్టి హేళన, చీర ఊడిపోతుందని మొరపెట్టుకున్నా!
తాను తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోయేదని గవర్నర్ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. తమది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. గవర్నర్ ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తోందని రాజ్ భవన్‌ను అసలు గుర్తించడం లేదని.. ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని గవర్నర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీకి వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖతో కూడా సమావేశమై.. తెలంగాణలో డ్రగ్స్.. అవినీతిపై నివేదిక అందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గవర్నర్‌పై మరింత దూకుడుగా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ భవన్‌లో వరి ధర్నాకు టీఆర్ఎస్ ఏర్పాట్లు ! కేసీఆర్ హాజరవుతారా?
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయంగా కూడా చురుగ్గా ఉంటారు. అయితే ఇప్పటి వరూక తెలంగాణలో బీజేపీ నియమించిన గవర్నర్లు ఉన్నప్పటికీ వివాదాస్పదం కాలేదు. ఇటీవలే గవర్నర్‌తో విభేదాలు పెరగడంతో వివాదం ప్రారంభమయింది.