Is KCR Bhhar Tour Sucess : బీహార్ సీఎం నితిష్ కుమార్‌తో కలిసి జాతీ రాజకీాయలు మాట్లాడేందుకు కేసీఆర్ వెళ్లారు. అధికారికంగా అయితే అమరవీరులు, రైతులకు సాయం చేయడానికి వెళ్లారు. అనధికారికం మాత్రం రాజకీయం. బీజేపీని ఎదుర్కోవడానికి అందరినీ ఏకం చేయడం లేదా.. ఏకం కావడం అనే కాన్సెప్ట్ అమలు చేద్దామనుకున్నారు. కానీ అలాంటిదేమీ వర్కవుట్ అవలేదన్న అభిప్రాయంఎక్కువగా వినిపిస్తోంది. దీనంతటికి కారణం ఓ ఇరవై సెకన్ల వీడియో. కేసీఆర్ మాట్లాడుతూండగానే నితీష్ వెళ్లడానికి ప్రయత్నించడమే కాదు..కేసీఆర్‌తో కలిసి పని చేస్తామని ఆయన ఎక్కడా చెప్పలేదు కూడా. అందుకే ఇప్పుడు కేసీఆర్ బీహార్ టూర్ సక్సెస్ అయిందా ఫెయిలయిందా అన్న చర్చ జరుగుతోంది.
నితీష్ కుమార్ అసంతృప్తి బట్టబయలు !
విపక్ష కూటమికి మోదీని నాయకుడిగా ప్రతిపాదిస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పలేదు. ఆ సమయంలోనే నితీష్ కుమార్ లేచి నిలబడ్డారు. ఇక చాలు వెళదామని జర్నలిస్టులకు సైగ చేశారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి చేయి పట్టి కూర్చోబెట్టారు. కానీ కొన్ని సెకన్లకే మళ్లీ నితీష్ కుమార్ లేచివెళ్లారు. అదే ప్రెస్‌మీట్‌లో నితీష్ కుమార్ మాట్లాడలేదు. బీజేపీపై కలిసి పోరాడదామని చెప్పలేదు. అందుకే ఈ వీడియోను ఇతర పార్టీల నేతలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కలసి కూర్చోలేని వారు కలసి పోరాటం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
విపక్ష పార్టీలు ఏకం కాలేకపోవడానికి మౌలిక కారణం అదే !
విపక్ష పార్టీలు అన్నీ బీజేపీకి వ్యతిరేకమే. మోదీని గద్దె దింపాలని అనుకుంటున్నాయి. కానీ ఆ పార్టీలు ఏకం కాకపోవడానికి కారణం నాయకత్వ సమస్య. తామంటే తాము ప్రధాని స్థాయి నేతలమని అన్ని పార్టీల్లోనూ నేతలు అనుకుంటూ ఉంటారు. మోదీ ప్రధాని కాక ముందు నితీష్ కుమార్ రేసులో ముందున్నారు. ఎన్డీఏ తరపున ఆయనే ప్రధాని అభ్యర్థి అనుకున్నారు. కానీ బీజేపీ మోదీకే ఓటేసింది. ఆ తర్వాత మోదీ శిఖరంలా ఎదిగారు. ఆయనను అందుకునే నేత ప్రతిపక్షాల్లో కనిపించడం లేదు. కానీ ఎవరికి వారుతమకే అందరూ ఏకగ్రీవంగా నాయకత్వం ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరూ తగ్గడంలేదు.
కేసీఆర్‌తో నితీష్ కలసి రావడం కష్టమే..!
కేసీఆర్ తమది ధర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అని చెప్పినా లేకపోతే.. ప్రత్యేక వేదిక ద్వారా కలసి పని చేస్తామని చెప్పినా... ఇరువురి మధ్య అండస్టాండింగ్ మాత్రం రాలేదు. తాము కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని నితీష్ కుమార్ చెప్పలేదు. కానీ కేసీఆర్ ను మాత్రం పొడిగారు. ఆయన తన దారిలో తాను ప్రయత్నిస్తున్నారని అభినందించారు. అంటే.. కేసీఆర్ బీహార్ పర్యటనలో పెద్దగా సఫరం కాలేకపోయారని అనుకోవచ్చు.