Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో నిర్వహించినట్లుగానే చింతన్ శిబిర్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. మేడ్చల్‌ జిల్లా కీసరలో జూన్‌ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌ నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి చింతన్‌ శిబిర్‌లో వివిధ అంశాలను చర్చించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆరు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు.  వ్యవసాయరంగం బలోపేతం, సామాజిక న్యాయాలపై చర్చ ఉంటుంది. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలపై మాత్రం చర్చించరు.  వాటిని ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోనియాగాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో.. దాన్ని నెరవేర్చేందుకు కషి చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 


గచ్చిబౌలిలో యువతిపై అత్యాచారం కేసులో మరో ట్విస్ట్, వెలుగులోకి గాయత్రి, శ్రీకాంత్ మోసాలు!


డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు !
 
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ రైతు డిక్లరేషన్‌ని పల్లెపల్లెకు రచ్చబండ కార్యక్రమంతో ఈనెల 21 నుంచి ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్. గ్రామాల్లో రచ్చబండతో రైతు డిక్లరేషన్ వివరించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తున్నారు.  


కేంద్రంలో బీజేపీ 8 ఏళ్ల పాలనపై ఎమ్మెల్సీ కవిత 8 ప్రశ్నలు, పెండింగ్ నిధులపై నిలదీత!


అమెరికాలో కీలక నేతలు!


ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారు.  రచ్చబండ కార్యక్రమాన్ని ప్రొపెసర్ జయశంకర్ సొంతూరులో ప్రారంభించిన తర్వాత పలు గ్రామాల్లో రచ్చబండను నిర్వహించారు. అయితే ఆయన అమెరికా వెళ్లడంతో తెలంగాణలో నేతలు కూడా రిలాక్స్ అయ్యారు.  పీ పీసీసీ స్టార్ క్యాంపెయనర్‌గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే రచ్చబండ కార్యక్రమానికి ముందే అమెరికా వెళ్లారు. 


తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఉంది - జయప్రద వెల్లడి, కేసీఆర్‌పైనా కీలక వ్యాఖ్యలు


చింతన్ శిబిర్‌కు ముఖ్య నేతలంతా వస్తారా ?


తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా చింతన్ శిబిర్ నిర్వహించాలని పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ కూడా ఆదేశించారు. ఆ మేరకు నేతలు శిబిరం నిర్వహిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా...  ఇప్పుడు కీలక నేతలు అమెరికాలో ఉన్నారు. చింతన్ శిబిర్ సమయానికి వస్తారా లేదా అన్న ఉత్కంఠ కాంగ్రెస్ నేతల్లో ఉంది. కీలక నేతలు పాల్గొనకపోతే శిబిరం సీరియస్‌గా సాగదని భావిస్తున్నారు.