Telangana Assembly Meetings  :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన సమావేశాల్లో గత పదేళ్లలో కనిపించనంత ప్రత్యేకత కనిపించంది.  రెండు పక్షాలూ హోరాహోరీగా తలపడటం… అధికారపక్షం తప్పించుకుపోవడానికి ప్రయత్నించకుండా విపక్షాల వాదన వినిపించే అవకాశం ఇచ్చి.. తాము సమాధానం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి.   సోమవారం ఉదయం ప్రారంభణైన అసెంబ్లీ తెల్లవారు జాము వరకూ సాగింది.  పార్టీలు హోరాహోరీగా తమ వాదనలు వినిపించాయి. అయితే చివరిలో మాత్రం రాజకీయ అంశాలు తెరపైకి వచ్చి.. పక్కదారి పట్టినట్లుగా అనిపించింది. అదొక్కటి మినహాయిస్తే.. అసెంబ్లీలో చాలా కాలం తర్వాత ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని అనుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.  


ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో ఆసక్తికర చర్చలు 


అసెంబ్లీ సమావేశాలంటే ప్రజల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సభలోకి వచ్చేవి. అందరూ సభలో గట్టిగా పైచేయి సాదించాలనే వచ్చేవారు. ఏ పక్షం కూడా వెళ్లిపోవాలని అనుకునేది కాదు. ముఖ్యంగా వైఎస్, చంద్రబాబు   ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఎవరు సీఎం అయినా..ఎవరు ప్రతిపక్ష నేత అయినా అసెంబ్లీ సమావేశాలు హైవోల్టేజ్ లో సాగేవి. విపక్షాన్ని కంట్రోల్ చేయడానికి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ కొన్ని సార్లు వ్యక్తిగత ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా… తర్వాత క్షమాపణలు చెప్పి సభ సాగేలా చూసేవారు. ఇలాంటి మంచి అసెంబ్లీ, పార్లమెంటరీ సంప్రదాయం ఆ తర్వాత మారిపోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో అసలు సభ నడిచిన సందర్భమే లేదు. బిల్లుల్ని చర్చ లేకుండా గందగోళం మధ్యనే  పాస్ చేసుకునేవారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా పరిస్థితి మారలేదు.   


మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?
  
తెలంగాణ, ఏపీల్లో పదేళ్లలో తగ్గిన అసెంబ్లీల ప్రాధాన్యం


తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టిన పదేళ్లలో వన్ సైడ్ అసెంబ్లీ  సెషన్స్ జరిగాయి.  విపక్షాల వాయిస్ ను వినేందుకు పెద్దగా అవకాశం దక్కలేద. రెండు సార్లు ఎల్పీల్ని విలీనం చేసుకోవడంతో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య బాగా తక్కువగా ఉండేది. అదే సమయంలో సభలో  సస్పెన్షన్లు ఎక్కువగా ఉండేది.  దాంతో పదేళ్ల పాటు అధికారపక్షం  చెప్పింది వినడమే అసెంబ్లీ అన్నట్లుగా సాగుంది. ఏపీలోనూ అంతే. మొదటి ఐదేళ్లు.. మంచి సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతగా జగన్  చివరికి రెండేళ్లు బాయ్ కాట్ చేశారు. తరవాత టీడీపీకి అతి తక్కువ బలం ఉన్నా వారిపై అసెంబ్లీలో వేధింపులకు పాల్పడటం.. సస్పెన్షన్ల వేటు వేయడంతో వారి వాయిస్ వినిపించలేదు. 
 
పూర్వ వైభవం వచ్చినట్లుగా తెలంగాణ అసెంబ్లీ


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రెండు రోజుల్లో కొన్ని ఘటనలు మినహా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా ప్రజా సంబంధిత అంశాలపై ఎక్కువగా చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష నేతలు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్క బడ్జెట్ ప్రసంగం రోజున మాత్రమే సభకు వచ్చారు. ఆయనకు సభకు రాకపోవడంతో కాంగ్రెస్ పదే పదే కార్నర్ చేసింది. అయితే మీకు మేము సరిపోతామని కేటీఆర్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో రాజకీయ అంశాలు చర్చకు రావడం.. పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి రావడంతో చర్చ దారి తప్పింది. మహిళల్ని రేవంత్ అవమానించారని .. బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంతో.. సభలో సస్పెన్షన్లు, వాకౌట్లు లేవనుకుంటున్న సమయంలో వాటికి చోటిచ్చినట్లయింది. సస్పెన్షన్లు లేకపోయినప్పటికీ  వాకౌట్లు.. స్పీకర్ చాంబర్ ఎదుట ధర్నాలు చోటు చేసుకున్నాయి. అలాగే  చివరి రోజు దానం నాగేందర్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం కూడా వివాదాస్పమయింది. ఇవి  మినహా.. తెలంగాణ అసెంబ్లీ ప్రజాస్వామ్య వాదులకు కొత్త ఆశలు రేపేలా సాగిందని అనుకోవచ్చు. 


మరోసారి ఎమ్మెల్సీల వివాదం - కేబినెట్ సిఫార్సులు ఆమోదించవద్దని గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ !


ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ చర్చలే ప్రాణం


ప్రజాప్రతినిధుల మొదటి విధి.. చట్టాలు చేయడం. చట్టసభలకు హాజరై.. కీలకమైన అంశాలపై చర్చించడం కీలకం. చర్చల్లోనే తప్పు ఒప్పులు బయటపడతాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టవచ్చు.  కానీ మారుతున్న రాజకీయంలో అసెంబ్లీ ప్రాధాన్యం తగ్గించడానికి అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలు రేపుతోంది.