Liquor shop auction likely to happen again in Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ పాలసీపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి రెండు నెలలు గడుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీ మార్పుపై దృష్టి సారించారు. శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పాలసీని కొసాగించే అవకాశం లేదని ఖచ్చితంగా మార్పు ఉండాలని నిర్ణయించారు. ఐదు కీలక రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఎలా ఉన్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న లిక్కర్ పాలసీల్ని పరిశీలించి వాటిలో ది బెస్ట్ అన్న విధానాన్ని ఎంపిక చేసుకుేన అవకాశం ఉంది. 


గతంలో లిక్కర్ షాపులకు వేలం !


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాష్ట్ర విభజన తర్వాత కూడా లిక్కర్ పాలసీ సింపుల్‌గా ఉండేది. దుకాణాలను వేలం వేసేవారు. లైసెన్స్ ను రెండేళ్లకు ఇచ్చేవారు. ఈ విధంగా ధరఖాస్తులతో పాటు లైసెన్స్ ఫీజు కూడా రెండు వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చేది. అమ్మకాలపై దుకాణాలదారులకు మార్జిన్ మాత్రమే ఉంటుంది. మద్యం దుకాణాలకు సరఫరా  చేసేది ఏపీబీసీఎల్ కార్పొరేషనే. అందుకే అక్రమాలకు అవకాశం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకూ అదే పాలసీ నడిచింది. తెలంగాణలో ఇప్పటికీ ఇదే పాలసీ నడుస్తోంది. 


ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో రీ ఇన్వెస్టిగేషన్ - విశాఖ పోలీసుల కీలక నిర్ణయం


వైసీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రభుత్వ దుకాణాలే !


2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని పూర్తి స్థాయిలో మార్చేసింది. దశల వారీ మద్య నిషేధం తమ విధానమని ప్రకటించి లైసెన్స్‌ల్ని రెన్యూవల్ చేయలేదు. ప్రభుత్వమే దుకాణాలను ఏర్పాటు చేసింది. అందులో పని చేసే వారిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో తీసుకున్నారు. అక్కడ్నుంచి ఏపీలో మద్యం వ్యవహారం వివాదాస్పదమవుతోంది. మీ బ్రాండ్ ఏది అని మందుబాబులు సిట్టింగ్ వేసుకునేటప్పుడు చెప్పుకుంటారు..కానీ అప్పటి వరకూ వారికి అలవాటు ఉన్న బ్రాండ్లు ఏవీ ఏపీలో కనిపించలేదు. కొత్త కొత్త బ్రాండ్లు వచ్చాయి. మరే రాష్ట్రంలో దొరకని బ్రాండ్లు ఏపీలోనే ఉండేవి. అవన్నీ వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే రవణా, హోలోగ్రాం స్టిక్కరింగ్, అమ్మకాలు ఇలా మొత్తం వైసీపీ నేతలు గుప్పిట్లోనే ఉన్నాయన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పైగా మద్యం అమ్మకాలు కూడా అత్యధికంగా నగదు ద్వారానే జరిగాయి. పేరుకు ప్రభుత్వమే అియినా ఏపీలో లిక్కర్ వ్యాపారం మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో పెట్టుకున్నారని ఎంత అమ్మకాలు జరిగాయని రికార్డు చేస్తే అంత జరిగినట్లని..  వేల కోట్ల అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూంటారు. అందుకే సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించి.. సీఐడీ విచారణకు ఆదేశించారు. వేల కోట్ల లావాదేవీలు జరిగాయి కాబట్టి.. ఈడీకీ కూడా రిఫర్ చేస్తామని ప్రకటించారు. 


ప్రస్తుత పాలసీ కొనసాగించే చాన్స్ లేనట్లే ! 


ప్రస్తుతం ఉన్న పాలసీపై ఆరోపణలతో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయి. దుకాణాలకు అద్దె కట్టుకోవడం దగ్గర నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. వైసీపీ నేతల పర్యవేక్షణలో ప్రస్తుతానికి మద్యం దుకాణాలు ఉన్నాయి.  ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత వైసీపీ పాలసీనే కొనసాగించే అవకాశం ఉండదు. అందుకే.. కొత్త పాలసీపై ప్రభుత్వం సీరియస్ గా వర్కవుట్ చేస్తోంది. లిక్కర్ పాలసీలో ప్రతీ విషయంలోనూ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల ఆరోపణలు వస్తాయని అందుకే.. నియంత్రణ వరకే ఉండాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. క్వాలిటీ లిక్కర్, బెల్టు షాపుల నియంత్రణ, అదే సమయంలో లిక్కర్ ఆదాయాన్ని ఇప్పటికే తాకట్టు పెట్టేసినందున ఆదాయం  తగ్గకుండా చూసుకోవాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లోని పాలసీలను ప్రకటించిన తర్వాత అధికారుల సిఫారసులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?


అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తేవడమే కీలకం


గత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి లిక్కర్ పాలసీ కూడా ఒకటి. మందుబాబులెవరూ వైసీపీకి ఓటేయలేని ఆ పార్టీ నేతలు కూడా నిట్టూరుస్తూ చెబుతున్నారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం లిక్కర్ పాలసీ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.