ప్రభుత్వంపై పోరాటంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను విభిన్నంగా ఉపయోగించుకుంటోంది. వైఎస్ఆర్‌సీపీ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా "చాలెంజ్" కాన్సెప్ట్‌తో విభిన్నంగా ప్రభుత్వ వైఫల్యాలను అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుమార్లు వైరల్ అయినా చైన్ చాలెంజ్ విధానాన్నే ఎప్పుడు ఎంచుకున్నారు.  మొదటగా అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు.  మూడు ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పి  గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  అమరనాథరెడ్డిలను నామినేట్ చేశారు. వారు కూడా వైఫల్యాలు చెప్పి ఇతరుల్ని నామినేట్ చేయాలన్నారు. 





అయ్యన్ననామినే్ట చేసిన నేతలు కూడా  వెంటనే స్పందించారు.   జగన్ ఇచ్చి అమలు చేయని హామీలను ట్వీట్ చేసి.. ఇతర నేతల్ని నామినేట్ చేశారు. 


 










అమర్నాథ్ రెడ్డి,  బుచ్చయ్య చౌదరి చెరో ఇద్దరు నేతల్ని  నామినేట్ చేశారు. 









ఇలా ఒకరి తర్వాత ఒకరు నామినేట్ చేసుకుంటూ పోతున్నారు. అందరూ ప్రభఉత్వ వైఫల్యాల్ని..  నెరవేర్చని హామీల్ని ట్వీట్లు చేస్తున్నారు. 


 





ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇలా చైన్ సిస్టంలా ట్వీట్లు చేస్తూండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ పార్టీల సోషల్ మీడియా ప్రచారంలో ఇదో కొత్త ఒరవడి అని టీడీపీ కార్యకర్తలు కూడా హుషారుగా షేర్ చేసుకుంటున్నారు.