Vijayawada MP  doing business with Kasireddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ..  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గుర్తించి అరెస్టు చేసింది. ఆయన కింగ్ పిన్ మాత్రమేనని ఈ స్కాంలో అసలు కింగ్ ఉన్నాడని ఆయనను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బయటకు వస్తున్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి..  విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ..వ్యాపారాలు చేస్తున్నారని కేశినేని నాని బయట పెట్టారు. 

మాజీ ప్రభుత్వ సలహాదారు . ఇప్పుడు మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశినేని రాజశేఖర్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ , అతని భార్య జానకి లక్ష్మి కేశినేనితో పాటు ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLPలో  భాగస్వామిగా ఉన్నారు.  ఈ కంపెనీ ప్లాట్ నంబర్ 9, సర్వే నంబర్ 403, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ - 500033 అడ్రస్‌తో ఉంది. అలాగే ఇటీవల అరెస్టు అయిన కసిరెడ్డి  సహాయకుడు దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఎషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్  లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇదే అడ్రస్ లో ఉంది. అంతే కాదు..  రెండు కంపెనీలకు ఒకే ఈమెయిల్ అడ్రస్ ఉపయోగిస్తున్నారని కేశినేని నాని చెబుతున్నారు. 

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ .  ఆఫ్‌షోర్ కంపెనీలలో పెద్ద మొత్తంలో అక్రమంగా మళ్లించిన నిధులను పెట్టుబడి పెట్టారని కేశినేని నాని ఆరోపించారు. కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, డెలావేర్, USA, కేశినేని గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, దుబాయ్, UAE కంపెనీల పేరుతో   లెక్కల్లో చూపని సంపదను లాండరింగ్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.  వాటిపై స్వతంత్ర,  ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని సీఎం చంద్రబాబును కోరారు. 

సిట్టింగ్ ఎంపీ , లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులతో సన్నిహితంగ ాఉంటారు. వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు.   మీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి సమగ్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేయించాలని డిమండ్ చేశారు.  ఈ ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఇంకా స్పందించలేదు. గతంలో కేశినేని నాని తప్పుడు ఆరోపణలు చేశారని ఆయనకు నోటీసులు పంపించారు. 

ఇద్దరూ సోదరులే అయినప్పటికీ బయటకు తెలియని కారణాలతో వారు వ్యక్తిగత శత్రువులుగా మారారు. కేశినేని నాని వైసీపీలోే చేరడంతో చిన్న టీడీపీలో చేరి ఆ పార్టీ టిక్కెట్ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఓటమి తర్వాత నాని.. రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ సోదరుడు పై మాత్రం ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు.