Toma Terra India : ప్రపంచ సుందరి 2025 (Miss World 2025) పోటీలను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్. ఇదే కాకుండా మరో గ్లోబల్ ఈవెంట్​ (Global Event)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అదే టొమా టెర్రా (Toma Terra Event). టొమాటాలతో జరిపే ఈ ఉత్సవం స్పెయిన్​లో బాగా ఫేమస్. పలు సినిమాల్లో కూడా ఈ ఈవెంట్​ని చూసే ఉంటారు. అయితే మరికొన్ని రోజుల్లో హైదరాబాద్​లో టొమా టెర్రా ఈవెంట్​ను నిర్వహించనున్నారు. మరి ఈ ఈవెంట్ డిటైల్స్ ఏంటో.. ఎంట్రీ టికెట్ ధర ఎంతో? ఈవెంట్​లోని హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఈవెంట్ ఎక్కడంటే.. 

టొమా టెర్రా ఈవెంట్ (India's First Tomatino Event)​ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. మే 11వ తేదీన ఈ ఈవెంట్​ను జరగనుంది. హైదరాబాద్​లో 160 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎక్స్​పీరియం ఎకో పార్క్​లో.. ప్రిజం అవుట్​డోర్స్ ఈ టొమా టెర్రా ఈవెంట్​ను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా టమోటాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. 

ఈవెంట్ హైలెట్స్

టొమా టెర్రా ఈవెంట్​లో భాగంగా టొమాటాలతో ఆడుకుంటూ.. వాటిని తొక్కుతూ ఎంజాయ్ చేస్తారు. టొమాటోలను క్రష్ చేస్తూ సాగే ఈవెంట్​ కాబట్టి దీనిని టొమా టెర్రా అంటారు. అయితే ఈ ఫన్ యాక్టివిటీతో పాటు పలు ప్రోగామ్స్​ను ఈవెంట్​లో యాడ్ చేశారు నిర్వాహకులు. మ్యూజిక్, లైవ్ డీజే, క్రేజీ ఫన్ జోన్స్ ఉండనున్నాయి. పెట్, కిడ్స్ జోన్స్ కూడా ఉంటాయి. గ్లోబల్ మ్యూజిక్, తాటికల్లుతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈవెంట్​కి వెళ్లొచ్చు. అంతేకాకుండా రుచికరమైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్​ కూడా ఈవెంట్​లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. 

టొమా టెర్రా ఈవెంట్ టికెట్స్.. 

టొమా టెర్రా ఈవెంట్​కు వెళ్లేందుకు కచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆన్​లైన్​లో బుక్​మై షో ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఎర్లీ బర్డ్ ఫీమేల్ టికెట్ కాస్ట్ 499. ఎర్లీ బర్డ్ మేల్ జీఏ 799, ఎర్లీ బర్డ్ కపుల్ జీఏ 999, ముగ్గురు అమ్మాయిలు గ్రూప్​గా వెళ్లాలనుకుంటే 1199, 5 గురు అమ్మాయిలు గ్రూప్​గా వెళ్లాలనుకుంటే 1999, ముగ్గురు మగవారు వెళ్లాలనుకుంటే 1999, 5 గురు మగవారు వెళ్లాలనుకుంటే 3499 ఖర్చుతో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.   

బ్యూటీ బెనిఫిట్స్.. 

టొమాటో ఫెస్టివల్​లో పాల్గొంటే బ్యూటీ బెనిఫిట్స్ కూడా సొంతమవుతాయి. టొమాటోలతో ఆడుకుంటూ.. చర్మానికి పూసుకుంటారు. అయితే టొమాటో స్కిన్​కి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా సమ్మర్​లో వచ్చే టాన్​ని దూరం చేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు స్కిన్​కి మంచి పోషణను అందిస్తాయి. స్కిన్ ర్యాష్ రాకుండా కాపాడుతాయి అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్​వల్ల ఒత్తిడి తగ్గి.. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందని చెప్తున్నారు. 

ఫుడ్ వేస్టేజ్?

ఈ ఈవెంట్​లో భాగంగా టమాటాలతో ఆడుకుంటూ, తొక్కుతూ.. ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఫన్​ని ఫీల్ అవుతారు. అయితే ఇలా చేయడం వల్ల టమాటాలు వేస్ట్ అవుతాయనే వాదన ఉంది. అయితే ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఓ అద్భుతమైన అంశంతో నిర్వాహకులు ముందుకు వచ్చారు. ఈ ఈవెంట్​లో వచ్చిన టొమాటో వ్యర్థాన్ని అంతా సేకరించి.. ఎక్స్​పీరియం ఎకో పార్క్​లో సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. దీనివల్ల ఈవెంట్​ సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా ఫుడ్ వేస్టేజ్ ఉండదు. 

ఫుడ్ వేస్టేజ్​ లేకుండా.. అందాని, ఆరోగ్యానికి హెల్ప్ చేసే ఈ ఈవెంట్​లో ఎవరైనా పాల్గొనవచ్చు. మదర్స్ డే రోజు స్పెషల్​గా నిర్వహిస్తున్న టొమా టెర్రా ఈవెంట్​కు వెళ్లేందుకు ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టికెట్స్ బుక్ చేసుకుని.. స్పెయిన్​లో పొందాలనుకున్న ఆనందాన్ని ఇండియాలోనే పొందేయండి.