Konidela Nagendra Babu is not getting lucky: కూటమి కోసం అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేసిన పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబుకు రాజ్యసభ సీటు మిస్ అయింది. ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు గాను ఒక దాన్ని బీజేపీ తీసుకుంది. తమ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించింది. ఆయన అధికారికంగా బీజేపీలో చేరలేదు. అయితే బీజేపీతో ఒప్పందం ప్రకారమే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. ఆర్ కృష్ణయ్యకు జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ సమీకరణాలు  వర్కవుట్ కావన్న ఉద్దేశంతో మళ్లీ ఆయనకు మిగిలిన కాలనికి రాజ్యసభ పదవి ఇస్తున్నారు. అంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. కాకపోతే మొన్నటి వరకూ వైసీపీ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ సభ్యుడిగా పార్లమెంట్ కు వెళ్తారు. 


ఏపీలో ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం చూస్తే కూటమిలో ఓ సీటు జనసేన పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పార్టీ తరపున ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్ర బాబు ఎంపీ కావడం ఖాయమని అనుకున్నారు. అయితే ఆయనకు అదృష్టం కలసి రాలేదు. రాజీనామా చేసిన వాళ్లకే సీట్లు కేటాయిస్తున్నారు. మోపిదేవి పదవీ కాలం రెండేళ్లే ఉంది. ఆయనకు ఢిల్లీ రాజ్యసభ పదవిపై ఆసక్తి లేదు. అందుకే ఆ స్థానాన్ని టీడీపీ తరపున సానా సతీష్‌కు ఇస్తున్నారు.  ఆయన టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అండగా ఉన్నారన్న్ కారణంగా పదవి ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. మరో స్థానం రాజీనామా చేసిన బీద మస్తాన్ రావుకు ఇస్తున్నారు.   


Also Read: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు


ఈ మూడు రాజ్యసభ సీట్లు ద్వైవార్షిక ఎన్నికల కారణంగా వచ్చినవి కావు.వైసీపీలో ఉండి రాజీనామాలు చేసిన కారణంగా వచ్చినవి. తెలుగుదేశం పార్టీకి చరిత్రలో తొలి సారిగా రెండేళ్ల కిందట రాజ్యసభసభ్యులు లేకుండా పోయారు. 2019 ఎన్నికల్లో అతి తక్కువ అసెంబ్లీ సీట్లు రావడంతో మూడు సార్లుగా జరిగిన ఎన్నికల్లో అసలు సీట్లను గెలుచుకోలేకపోయారు. ఉన్న వారి పదవి కాలాలు పూర్తయ్యాయి. దాంతో టీడీపీకి రాజ్యసభ సభ్యులు లేకుండా పోయారు. ఇప్పుడు ఇద్దరు సభ్యులతో మళ్లీ ప్రాతినిధ్యం లభించబోతోంది. ఇప్పటి నుంచి ఖాళీ అయ్యే ప్రతి రాజ్యసభ సీటు కూటమికే లభించనుంది. 


Also Read: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు


ఇవి రాజీనామాలు చేసిన వారి వల్ల వచ్చిన ఎన్నికలు.. మళ్లీ వారికే కేటాయిస్తున్నందున జనసేనకు అవకాశం లభిచంలేదని చెబుతున్నారు. తర్వాత ఖాళీ అయ్యే సీట్లలో ఖచ్చితంగా జనసేనకు స్తానాలు లభిస్తాయని అంచనా ఉంది. అయితే అప్పుడు కూడా బీజేపీ నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. పైగా నాగబాబుకు అవకాశం కల్పిస్తే కుటుంబసభ్యులకే ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న విమర్శలు వస్తాయి. అందుకే నాగేంద్రబాబుకు అదృష్టం కలసి వస్తుందా అన్న చర్చ జరుగుతోంది.