Just In





Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
AP BJP Vishnu: రాయచోటిలో అయ్యప్ప భక్తులపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

BJP strongly condemned the attack on Ayyappa devotees in Rayachoti : ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటినియోజకవర్గంలో అయ్యప్పస్వామి భక్తుల పై దాడి జరగడం కలకలం రేపుతోంది. పవిత్రమైన అయ్యప్ప భక్తులు రాయచోటిలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి అయ్యప్పస్వామి శోభాయాత్ర మీద కోంత మంది ఇతర వర్గానికి చెందిన వారు దాడి చేశారు. మతపరమైన విమర్శలు చేస్తూ శాంతి భద్రతలు విఘాతం కలిగించి, ర్యాలీని అడ్డుకోని, భక్తుల మీద భక్తులు ప్రయాణిస్తున్న వాహనాలు మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించారు. తక్షణం రాయచోటిలో అయ్యప్ప స్వాములపై జరిగిన దాడులపై కేులు నమోదు చేసి చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇదే రాయచోటి, గుంటూరు, మరియు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి వాహనాలను తగలబెట్టి పోలీసులు మీద రాళ్లు రువ్వి ఐపీఎస్ అధికారుల మీద కూడా దాడులు చేశారని గుర్తు చేశారు. ఆ వ్యక్తులపై గత వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు రాజకీయ స్వార్థంతో చట్టాన్ని దుర్వినియోగం చేసి ఆస్తులు ధ్వంసం చేసిన సంఘటనలు కేసులు కూడా నాడు మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసులు ఎత్తివేయడం దారుణమని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జీవో నంబర్ 776 తీసుకొచ్చి కేసులు ఎత్తివేయడం జరిగింది.గతంలో ఎత్తివేసిన కేసులపైన ప్రభుత్వం న్యాయ సమీక్ష చేసి నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి కేసులు విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే పోలీసులు మీద చట్టం మీద న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాయచోటిలో మత సామరస్యానికి ఇప్పటి వరకూ ఎలాంటి సమస్యలు రాలేదు. ఎవరి వర్గం పండుగలు, సంబరాలకు వారు ఘనంగానే ఏర్పాట్లు చేసుకుంటారు. అందరూ అన్ని మతాలను గౌరవిస్తారు. అయితే ఈ సారి అయ్యప్ప స్వామి భజన సందర్భంగా వేరే వర్గంవారు దాడులు చేయడం కుట్ర పూరితంగా జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారం సున్నితమైనది కావడంతో పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు.