Rajya Sabha members and MLCs will resign from YCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల విప్లవం కనిపించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యసభకు తమకు పదకొండు మంది ఎంపీలు ఉన్నారని.. తమ మద్దతే కేంద్ర ప్రభుత్వానికి కీలకమని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
గురువారం రాజీనామా చేయనున్న మోపిదేవి
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు గురువారం తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ కు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి తన కుటుంబానికి కాకుండా ఇతరులకు టిక్కెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి గుర్యయారు. ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎంపీ బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభకు.. వైసీపీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది ఎంపీలుగా కూడా అదే బాటలో ఉన్నారని.. ఇతర పార్టీలతో వారు జరుపుతున్న చర్చలు కొలిక్కి వస్తే.. అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారని అంటున్నారు.
పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు
రాజీనామాల బాటలో ఎమ్మెల్సీలు
ఏపీ శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేసేందుకు రెడీ అయిపోయారు. చీరాల నేత పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆమె చెబుతున్నారు. మరికొంత మంది ఎమ్మెల్సీలు కూడా ఇదే దారిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో లేకుండా ఉన్నా మంచిదే కానీ వైసీపీలో మాత్రం ఉండకూడదని అనుకుంటున్నారు.
విశాఖ కోర్టుకు హాజరు కానున్న నారా లోకేష్ - కేసేమిటంటే ?
ఇతర పార్టీల్లో చేరితే వారి పదవులు వారికే
వారంతా ధైర్యంగా పదవులకు కూడా రాజీనామాలు చేయడానికి మరో కారణం ఉందన్న వాదన వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వస్తాయి. వైసీపీకి అసలు బలం లేదనందున.. ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం ఉండదు. మొత్తం కూటమికే దక్కుతాయి. రాజీనామా చేసిన వాళ్లు మళ్లీ కూటమి పార్టీల్లో చేరితే సీట్లు వారికే ఇస్తారు అంటే పదవులు వారికే వస్తాయి. ఎమ్మెల్సీ పదవులు కూడా అంతే. అందుకే వారు రాజీనామాకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపికీ అసెంబ్లీలో కనీస బలం లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. రాజీనామాల విప్లవానికి కారణం అవుతోంది.