YSRCP Mp Mopidevi Venkataramana:వైసీపీకి రోజు రోజుకు సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు సైలెంట్‌గా ఉండిపోతే... మరికొందరు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొందరు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే మంత్రిగా పని చేసిన ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే బాట
వైసీపీకి షాక్ ఇచ్చిన మోపిదేవి
ఇప్పటి వరకు రాజీనామా చేసిన వాళ్లంతా మాజీలే. ఇప్పుడు మాత్రం ఎంపీగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజీనామాకు సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. త్వరలోనే శ్రేణులతో సమావేశమై రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దాదాపుగా గురువారం రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా ఆయన స్పందించలేదు.
బాపట్ల జిల్లాకు కీలక నేతగా ఉంటూ వస్తున్న మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కీలకమైన అనుచరులతో సమావేశమైన ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు. గురువారం లేదా శుక్రవారం తన అభిమానులతో సమావేశమై రాజీనామా విషయాన్ని ప్రకటించనున్నారు.
6 లేదా 8న టీడీపీలోకి
గురువారం కానీ శుక్రవారం కానీ వైసీపీకి రాజీనామా చేయనున్న మోపిదేవి ఆరు లేదా ఎనిమిదో తేదీన సైకిల్ ఎక్కనున్నారు. అనుచురలతో సమావేశం అనంతరం, చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చిన తేదీని మీడియాకు చెప్పనున్నారు.
మోపిదేవి నిర్ణయంతో రాజకీయ కలకలం
అక్రమాస్తుల కేసులో జగన్‌తోపాటు జైలుకు వెళ్లి వచ్చిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తోంది. అయితే అనుచరులతో సమావేశంలో మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. పార్టీలో కొందరు అనుసరిస్తున్న విధానాలు, జగన్ తీరు నచ్చడం లేదని చెబుతున్నారు. ఎన్నికల ముందు నుంచి కాస్త అసంతృప్తిగానే ఉన్నారని ఇప్పుడు అది మరింత తీవ్రమైందని అంటున్నారు.
పెత్తనం రెడ్డీ వర్గానిదే
వైసీపీ పేరుకో బీసీల పార్టీ అంటు జపం చేస్తోందని కానీ అక్కడ ఆ పరిస్థితి లేదని మోపిదేవి అంటున్నారు. జగన్‌తో జైలుకు వెళ్లి చిప్పకూడు తిన్నప్పటికీ తగిన గౌరవం ఇవ్వలేదని వాపోయారట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరికో ప్రయార్టీ ఇస్తున్నారని తమ లాంటి బీసీలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వారిదే పెత్తనం కొనసాగుతోందని ముఖ్యంగా రెడ్డి సామాజికి వర్గాన్ని టార్గెట్ చేసుకొని ఆయన విమర్శలు చేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు.
మంత్రి పదవి కష్టం కానీ ఎంపీగా ఓకే
మరోవైపు టీడీపీలోకి వచ్చేస్తే ఎలాంటి ప్రయార్టీ ఉంటుందనే డిస్కషన్ కూడా జరిగినట్టు చెబుతున్నారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని మోపిదేవి అడిగితే... ఒకే జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇబ్బంది అవుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి మోపిదేవికి మంత్రి పదవి ఇవ్వడం కుదరదని చెప్పిసినట్టు సమాచారం. అయితే రాజ్యసభను రెన్యువల్ చేసేందుకు మాత్రం అంగీకరించిందనే టాక్ నడుస్తోంది.
కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన మోపిదేవి వెంకటరమణ జగన్‌తోపాటు జైలుకు వెళ్లి వచ్చారు. అనంతరం వైసీపీలో చేరి అక్కడ కూడా తన పట్టు నిలుపుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా కూడా పని చేశారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆయనను పార్టీ రాజ్యసభకు పంపించింది.
Also Read: జనసేన వర్సెస్ అల్లు అర్జున్- పవన్ కల్యాణ్ సిగ్నల్ ఇచ్చినట్టేనా?