AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 22ఏ, ప్రీహోల్డ్ భూములపై రీ సర్వే చేయాలని, సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్ముల తొలగించాలని తీర్మానించింది. సెబ్‌ రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని తేల్చింది.  రివర్స్ టెండరింగ్ విధానానికి ముగింపు పలికింది. పోలవరం ఎడమకాలువ పురుద్ధరణ, కాలువ సామర్థ్యాన్ని ఆరు వేల క్యూసెక్కులకు పెంచేలా నిర్ణయం తీసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి కూడా కేబినెట్ ఓకే చెప్పింది. 


కొత్త రేషన్ దుకాణాలు- ఉద్యోగాలు


వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టులు భర్తీ చేయాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. కొత్తగా 2,771 రేషన్ దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


ఈ-కేబినెట్


ఇకపై ఇవాల్టి నుంచి పేపర్ లెస్‌ కేబినెట్ మీటింగ్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014-19 మధ్య ఇలా పేపర్ లెస్ కేబినెట్ చంద్రబాబు నిర్వహించే వాళ్లు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో మళ్లీ పేపర్ లెస్‌ విధానం తీసుకొచ్చారు. ఈ విధానంలో మంత్రులకు ఆన్‌లైన్‌లోనే నోట్ ఇతర వివరాలు అందజేస్తారు. ఇప్పటికే మంత్రులకు సహాయం చేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 


Also Read: జనసేన వర్సెస్‌ అల్లు అర్జున్- పవన్ కల్యాణ్ సిగ్నల్ ఇచ్చినట్టేనా?