Nara Lokesh will appear in Visakhapatnam court on Thursday : ఆగస్టు 29వ తేదీన మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. గతం లో ఆయన తనపై తప్పుడు ప్రచారం చేశారని..ఓ దినపత్రికపై పరువు నష్టం దావా వేశారు. వైజాగ్ లోని 12వ అడిషనల్ జిల్లా కోర్టలో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరవుతున్నారు. గతంలో కూడా ఓ సారి కోర్టుకు హాజరయ్యారు.
2019 కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాం లో నారా లోకేష్ IT మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా పనిచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత " చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి`` అనే టైటిల్ తో 2019 అక్టోబర్ 22న ఓ ప్రముఖ పత్రికలో కథనం రీ ప్రచురించారు. అది కూడా వైజాగ్ పర్యటన సమయం లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లాబీల్లో జరిగిన మీటింగ్స్ కోసం సప్లయి చేసిన స్నాక్స్ కోసం ఈ రూ. 25 లక్షలు ఖర్చు చేశారని ఆ కథనం లో పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని రాసిన ఆర్టికల్ అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన లాయర్ ల ద్వారా నోటీసుని సాక్షికి పంపించారు.
కొన్ని ఇతర పత్రికలు, మ్యాగజైన్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. వారందరికీ నారా లోకేష్ నోటీసులు పంపించారు. దీంతో ఆ పత్రికలు తప్పుడు సమాచారం వల్ల అలా రాశామని.. వివరణ ఇచ్చారు. ప్రముఖ దినపత్రిక మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో నారా లోకేష్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు పూర్తిగా అబద్దాలతో ఆర్టికల్ రాశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు నారా లోకేష్. తాను వైజాగ్ లో ఉన్నానని ప్రచురించిన టైం లో అసలు విశాఖలోనే లేనని పిటిషన్ లో పేర్కొన్న లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే గెస్టు లకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన బిల్లు ను తనకు అంటగడుతూ తన ఇమేజ్ ను మంటగలిపేందుకు ఉద్దేశ్య పూర్వకంగా ప్రయత్నించారని కోర్టు కు తెలిపారు .
ఆయన . మంత్రి హోదా లో తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని కూడా స్పష్టం చేశారు. అయితే నాటి నుండి వివిధ కారణాలతో చాలా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్‌తో మళ్లీ మొదలు కానుంది .దానికోసం స్వయంగా నారా లోకేష్ గురువారం వైజాగ్ కోర్టుకు హాజరు కానున్నారు . తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పలువురు వ్యక్తులకు కూడా లోకేష్ నోటీసులు ఇచ్చారు. వారిలో పోసాని కృష్ణమురళి కూడా ఆయన పై కూడా మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.