తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ( T CONGRESS ) గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  ( Rahul Gandhi ) రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు.  ఈ నెల 28న వరంగల్‌లో ( Warangal ) నిర్వహించనున్న భారీ బహిరంగసభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తర్వాతి రోజు   ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.  పార్టీ నేతల సమావేశంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించక చాలా కాలం అవుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ( Revant Reddy )  నియమితులయ్యాక.. పలుమార్లు రాహుల్ గాంధీతో సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ సారి మాత్రం రాహుల్ గాంధీ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది. 


వరంగల్‌ TRSలో అంతర్గత ఆధిపత్య పోరు! ఫ్లెక్సీల చింపివేత కలకలం


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాజకీయ ప్రయోజనాలు పొందడంలో మాత్రం విఫలమవుతోంది. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి నడిపించే నాయకుడు కరవవడం.. కొత్తగా ఎవరిని నియమించినా గ్రూపు ( Congress Group Politics )  తగాదాలు పెరిగిపోవడంతో పార్టీ విజయాలు నమోదు చేయలేకపోతోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించిన తర్వాత కూడా పరిస్థితులు మారలేదు. సీనియర్లు ఆయనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణ పర్యటనపై ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదు. 


ఇప్పుడే మొదలైంది త్వరలోనే భారీ చేరికలు- తెలంగాణ మార్పు కోరుకుంటోంది: బండి సంజయ్


అయితే ప్రస్తుతం అందర్నీ ఢిల్లీకి (  Delhi ) పిలిపించి మూడు గంటల పాటు రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. పార్టీని నష్ట పరిస్తే ఊరుకునేది లేదని సీనియర్లకు నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అందరూ సైలెంటయ్యారు. ఇక నుంచి పార్టీని బలహీనం చేసేలా వ్యవహరిస్తే వేటు ఖాయమని చెప్పడంతో జగ్గారెడ్డి లాంటి నేతలు ... గతంలో తాము ఏం మాట్లాడామో మర్చిపోయామని.. రాజీనామా లేఖను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. 


మాంసం కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటిదే - ఒవైసీ వ్యాఖ్యలు, ప్రధాని మోదీకి కౌంటర్


ప్రస్తుతం తెలంగాణలో  మన ఊరు - మన పోరు వంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. రాహల్ గాంధీ పర్యటన తర్వాత క్యాడర్‌లో మరింత ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.