Pawan Kalyan Met With Konatala In Visakhapatnam : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి ఏడున్నర గంటలకు నగరానికి వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పెదవాల్తేరులోని కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. కొణతాల రామకృష్ణ కొద్దిరోజులు కిందటే పార్లీలో చేరారు. ఆయన ఇంటికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఏకాంతంగా కొణతాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

Continues below advertisement


అనంతరం బయటకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సమస్యలు, పార్టీ నిర్మాణం, రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చినట్టు పవన్‌ తెలిపారు. ఢిల్లీ పర్యటన తరువాత మరింత స్పష్టత వస్తుందని పవన్‌ వెల్లడించారు. కొణతాల ఇంటి నుంచి నోవాటెల్‌ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. అక్కడ పార్టీ నేతలు, కార్పొరేటర్లుతో సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై వారితో చర్చించారు. 


రెండు రోజలపాటు విశాఖలోనే


పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ రావాల్సి ఉన్నప్పటికీ.. విమానం ఆలస్యం కావడంతో ఏడున్నర గంటలకు విశాఖకు వచ్చారు. సోమవారం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే నేతలకు సమాచారాన్ని అందించారు. పొత్తులు, పోటీ చేసే స్థానాలు, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడం, బీజేపీతో పొత్తు వంటి అంశాలను పవన్‌ కల్యాణ్‌ ముఖ్య నేతలతో చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు నుంచి సమాచారం.