Reactions On Ambedkar :  కోనసీమ జిల్లా రావులపాలెం మండ‌లం గోపాలపురంలో  రాజ్యాంగ నిర్మాత కు అవమానం జరిగింది.,   ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పేపర్‌ ప్లేట్లపై  రాజ్యాంగ నిర్మాత ఫోటో ఉంది.  వాటితోనే  ఫుడ్‌ అందించారు. దాంతో  హోటల్ యజమాని వెంకటరెడ్డిని స్థానిన యువకులు నిలదీశారు. ప్లేట్లను వ్యాపారి సుధాకర్ సరఫరా చేశాడని హోటల్ యజమాని చెబుతున్నారు.  అయితే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ హోటల్‌ ఓనర్‌ వెంకటరెడ్డిపై, వ్యాపారి సుధాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వ్యాపారులు నిలదీసిన యువకులపై రివర్స్ ఫిర్యాదుచేశారు.  మొత్తం 16 మంది యువకులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో  ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. 


రాజ్యాంగ నిర్మాతకు అవమానంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం 


ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ నిర్మాత  ఫొటోలను కాగితం ప్లేట్లపై ముద్రించి ఉండటాన్ని చూసి ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  ఫొటోలను చూసి నిరసన వ్యక్తం చేసిన 18 మంది ఎస్సీ యువకులపై నేరపూరిత కుట్రను ఆపాదిస్తూ కేసు నమోదు చేయడం ద్వారా సమస్యను మరింత తీవ్రతరం చేశారని ఆయన విమర్శించారు.



నిరసన చేసిన వారిపై కేసులు పెట్టడం దారుణమన్న పవన్ 


ఇలాంటి సున్నితమైన వ్యవహారాల్లో పోలీసు అధికారులు సామరస్య ధోరణితో వ్యవహరించాలని పవన్ అన్నారు. ప్రజల మధ్య దూరం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతో పాటు అన్ని పార్టీలపైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్థానికంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు ఒక తాటిపైకి వచ్చి శాంతి కమిటీలు వేసుకుని సుహృద్భావ పరిస్థితులు నెలకొనేలా చర్చించుకోవాలని సూచించారు.


పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం 


టీడీపీ నేత నారా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించారు.  అన్యాయన్ని ప్రశ్నించినందుకు  ద‌ళిత యువ‌కుల‌పై 120బీ సెక్షన్‌ కింద కేసులు న‌మోదు చేసి, జైలులో బంధించ‌డం రాష్ట్రంలో ద‌ళితులపై సాగుతున్న ద‌మ‌న‌కాండ‌కు నిద‌ర్శనమని మండిపడ్డారు. అ బేష‌ర‌తుగా యువ‌కుల‌పై కేసులు ఎత్తేసి, వారిని జైలు నుంచి విడుద‌ల చేయడంతోపాటు అంబేడ్కర్​ని అవమానించిన వారిని శిక్షించాలని చేయాలని డిమాండ్​ చేశారు.