New Executive Committee in Andhra Cricket Association : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం రాజీనామాలు సమర్పించింది. ప్రస్తుతం  ఏసీఏ అధ్యక్షులుగా అరబిందో గ్రూప్‌నకు చెందిన పి శరత్‌ చంద్రారెడ్డి ఉన్నారు. ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి నిందితునిగా ఉన్నారు. తర్వాత అప్రూవర్ గా మారారు.  ఉపాధ్యక్షులు ఆయన సోదరుడు పి రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు. ఇక ఏసీే  కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి, సహాయ కార్యదర్శి రాకేష్, కోశాధికారి ఎవి చలం, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పురుషోత్తంలు ఉన్నారు. వీరంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో పని చేస్తారని చెబుతూంటారు. ఇప్పుడు వీరంతా రాజీనామా చేశారు. క్రికెట్‌ అసోసియేన్‌లో మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నకల్లో గెలిచిన వారు మూడేళ్లు అసోసియేషన్‌ పాలకవర్గంగా ఉంటారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. అయినా వీరంతా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు.కొత్త కార్యవర్గం ఎంపిక ప్రక్రియను  ప్రారంభించారు.   


క్రికెట్‌లో చొరబడిన రాజకీయాలు


ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదు. బీసీసీఐ నియంత్రణలో ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క రూపాయి నిధులు. ప్రభుత్వ కార్యక్రమాలేవీ ఏసీఏ చేపట్టదు. ఏసీఏ కిందట రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అసోసియేషన్‌లు, 31 పట్టణాల్లో క్రికెట్‌ క్లబ్సులు ఉన్నాయి. వీరిలో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు, క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు, మరికొందరు సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఇంటర్నేషనల్‌ ప్లేయర్లకు ఓట్లు ఉంటాయి. గతంలో గోకరాజు గంగరాజు వంటి పారిశ్రామికవేత్తలు, చాముండేశ్వరి నాథ్ వంటి మాజీ క్రికెటర్లు ఏసీఏను నడిపించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. పాత వాళ్లు పట్టించకోవడం మానేశారు. 


నిర్మాణాత్మక చర్చలతో ప్రజాస్వామ్య కళ - తెలంగాణ అసెంబ్లీ మారిపోయిందా ?


గత ఐదేళ్ల కాలంలో పలు వివాదాలు


ఏసీఏలో గత ఐదేళ్లలో అనేక వివాదాల ువచ్చాయి. ముఖ్యంగా  హనుమ విహారి ఉదంతంతో పెద్ద రచ్చ జరిగింది.  హనుమ విహారి కెప్టెన్సీలో ఆంధ్ర జట్టు మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో 17 నంబర్ ఆటగాడిగా ఉన్న ఓ వైసీపీ నేత కుమారుడ్ని దూషించారని ఆయన కెప్టెన్సీని తీసేశారు. బయట రాష్ట్రాల్లో ఆడకుండా ఎన్వోసీ కూడా ఇవ్వలేదు. దీనిపై రచ్చ  జరగడంతో చివరికి  ఎన్నికల  ఫలితాలు వచ్చిన రోజున వైసీపీ ఓడిపోవడంతో ఆఘమేఘాల మీద ఎన్వోసీ ఇచ్చారు. తర్వాత విహారి .. అమరావతిలో లోకేష్, పవన్ కల్యాణ్‌లను కలిశారు. వారు మళ్లీ ఏపీ టీముకే ఆడాలని కోరారు. దానికి విహారీ అంగీకరించారు.  ఏసీఏను రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆర్థిక పరమైన అవకతవకలకు  పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి మధ్య కార్యకవర్గం రాజీనామా చేసింది. 


ఏపీలో ఎక్సైజ్ పాలసీలో సమగ్ర మార్పులు ఖాయమా ? మళ్లీ దుకాణాల వేలం పాట ఉండబోతోందా ?


కొత్త ఏసీఏ చీఫ్ ఎవరు ?


విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల్లో పరోక్షంగా కీలకంగా వ్యవహరిస్తున్నట్లగా చెబుతున్నారు.  పలువురు ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ఏసీఏ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడితో పాటు, తూర్పు గోదావరికి చెందిన ఓ నాయకుడు కూడా ఏసీఏ పీఠంపై కూర్చోవాలని బలంగా పావులు కదుపుతున్నారు.  మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ రెడ్డిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ రెడ్డి ధోనీకి అదే సమయంలో విరాట్ కోహ్లీతో పాటు ధోనీతోనూ మంచి సంబంధాలున్నాయి.  ఇటీవలి ఎన్నికల్లో జేసీ పవన్ రెడ్డి పోటీ చేయలేదు. అందుకే ఆయన ఏసీఏ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ క్రికెటర్లనే ఎంచుకోవాలనుకుంటే.. ఎమ్మెస్కే ప్రసాద్ పేరును పరిసీశిలించే అవకాశం ఉంది. ఎవరికి ఏసీఏ చీఫ్ గా అవకాశం లభిస్తుందన్నదానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.