రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తనపై వైఎస్ఆర్‌సీపీకి ( YSRCP ) చెందిన కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) విమర్శించారు. ఈ విషయంలో ఇక సహనంతో ఉండేది లేదని న్యాయపోరాటం ద్వారా తేల్చుకుంటానన్నారు. విశాఖ కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ తెలుగు, మరో ఇంగ్లిష్ దినపత్రికలపై లోకేష్ రూ.75 కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 


అరెస్ట్‌కు సన్నాహాలు - అయ్యన్న మాస్టర్ ప్లాన్ ! వెనక్కి పోలీసులు...


2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో  లోకేష్ ప్రజాధనం తో  రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో ( Vizag ) లేనని ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ లోకేష్ వివరణ ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. ఆ వార్తను ప్రచురించిన ఓ పత్రిక క్షమాపణలు చెప్పింది కానీ తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు పట్టించుకోలేదని.. కనీసం తన వివరణ కూడా ప్రచురించలేదన్నారు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నానన్నారు. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. 


సంపాదించకుండా ఖర్చు పెడితే దివాలానే - ఏపీనే సాక్ష్యమన్న బీజేపీ ! జగన్ పాలనపై తీవ్ర విమర్శలు


రాజకీయాల్లోకి రాక ముందు నుంచే  వ్యక్తిగత జీవితంపై కూడా  బురద జల్లారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని లోకేష్ విమర్శించారు.    వేటికీ భయపడను..తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.  అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని కించపర్చేలా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మేం మాట్లాడితే.. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. కానీ అది మా మా సంస్కృతి కాదు. ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశాను. నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టననని లోకేష్ స్పష్టం చేశారు. 


పరువు నష్టం దావా విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ వచ్చారు. దీనిపై కౌంటర్ వేయడానికి ఇతర మీడియా సంస్థలు సమయం కావాలని అడిగాయి. ఇప్పటికే పలుమార్లు అలా అడగడంతో న్యాయమూర్తి ఎక్కువ సమయం ఇవ్వలేమని 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.