Dharmana Prasad : వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థపై ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు కూడా వీరి జాబితాలో చేరుతున్నారు. తాజాగా రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్ల ను తప్పించాలన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి సింగిపురం లో జరిగిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు ఎసరు పెట్టే వాలంటీర్ల ను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టిడిపికి సపోర్ట్ చేసే వాలంటీర్లు మీకు మీరుగా రిజైన్ చేయండని సూచించారు.
ఆర్జీవీ సినిమా పోస్టర్లను దగ్గరుండి చించేయించిన కలెక్టర్ - అంత అసహ్యంగా ఉన్నాయా ?
మీరు రిజైన్ చేయకపోతే మేమే తీసేస్తాం అని హెచ్చరించారు. మేము కిరీటం పెడితే మీరు మాకు ఎసరు పెడితే ఎలా అంటూ వాలంటీర్ల ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అబద్దాలు చెప్పి తిరగటం ఎందుకు బయటికి వెళ్లి టిడిపి కి ప్రచారం చేసుకోవాలని ధర్మాన హెచ్చరించారు. మంత్రికి ఒక్క సారిగా వాలంటీర్ల మీద ఎందుకు కోపం వచ్చిందో కానీ ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్‌సీపీకే పని చేయాలన్నట్లుగా ఆయన మాటలు ఉండటంతో వివాదాస్పదమవుతున్నాయి. నిజానికి వాలంటీర్లు అంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే అన్నట్లుగా మాట్లాడటం ధర్మానతోనే ప్రారంభం కాలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుండి పలువురు వ్యాఖ్యలు చేశారు.
ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పథకాలు లేవు, బటన్ నొక్కి రూ.1.65 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం- సీఎం జగన్
మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా వంటి వారు.. వాలంటీర్లు పని చేయకపోతే తీసేయమని చెప్పేశారు. వారంతా మన పార్టీ కార్యకర్తలేనని.. మనం చెప్పిన పని చేయకపోతే ఎందుకు ఉంచాలని వారు నేరుగానే చెప్పారు. గతంలో విజయసాయిరెడ్డి వాలంటీర్లలో 90 శాతం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలేనని ప్రకటించడం కూడా వివాదాస్పదమయింది. అయితే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. తమకు ప్రజల్లో పలుకుబడి తగ్గిపోయిందని... పథకాల కోసం వాలంటీర్ల దగ్గరకే వెళ్తూండటంతో వాలంటీర్లు కూడా తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి నేతల్లో కనిపిస్తోంది.
ఎన్నికలు దగ్గరనపడుతున్ననసమయంలో వాలంటీర్లు తమకు మద్దతు ఇవ్వకుండా.. తాము చెప్పిన పని చేయకుండా ఇతర పార్టీలకు మద్దతిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుమానం పెంచుకుంటున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.