Congress Rally : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో నిరసనల తీవ్రత అధికంగా కనిపించింది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ సారథ్యంలో పార్టీ నాయకులు బెంగళూరులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ఢిల్లీకి తరలివచ్చారు.