AP Ysrcp MLAs Tension :    గడప గడప కార్యక్రమానికి హాజరు కావాలంటే ప్రజా ప్రతినిధులు వెనక్కి తగ్గుతున్నారు.  ఒక పక్క‌ ప్రజలలో పెరిగిపోతున్న అసహనం, సహకరించని పార్టీ క్యాడర్‌తో సతమతమౌతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాను చేయవలసినది అంతా చేస్తున్నాను..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాను...మీట నొక్కి మరీ ప్రజల‌ ఖాతాలలో నగదును జమ చేస్తున్నాను...నేను చేస్తున్న పనులను  ప్రజలలోకి తీసుకు వెళ్లకపోతే ఊరుకొనేది లేదు అంటూ ఎంఎల్ఏ లకు సీయం జగన్ హుక్కుం జారీ చేశారు .  నిధుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పంపారు. అయినా ఎమ్మెల్యేలుక కదలడం లేదు. 


సంక్షేమ పథకాలు తారక మంత్రమనుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ హైకమండ్ ! 
 
సంక్షేమ పథకం అందుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని ప్రభుత్వం అనుకుంటోంది.  కానీ‌‌ క్షేత్ర స్థాయిలో ఈ పథకాలే  ప్రజా ప్రతినిధులను భయపెడుతున్నాయి.. టెక్నికల్ గా ఈ పథకాలు అర్హులకు అందటం లేదు ...అనర్హులకే చేరుతున్నాయి...గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రజల‌ను కలుస్తున్న నాయకులకు ప్రధానంగా మీట‌నొక్కి రిలీజ్ చేసిన పథకాలపైనే  ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కో వలసి‌ వస్తుంది .  వార్డ్ వాలంటీర్  వ్యవస్థ రాకతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాధాన్యతను కోల్పోయారు... ఈ పరిస్థితులలో వార్డుకు ఎంఎల్ఏ వచ్చినా  కార్యకర్తల‌ సహకారం అంతంత మాత్రంగా ఉంది...ఇక ప్రత్యేక అతిధులుగా  మంత్రులు వచ్చినా వారెవరో కార్యకర్తలకు, అక్కడి నాయకులకే తెలియడం లేదు. 


నిరసనలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 


 గడప గడప కార్యక్రమలో ప్రజల‌నుంచి రోజు రోజుకు అసంతృప్తి సెగలు పెరిగిపోతున్నాయి...స్థానిక కార్యకర్తలు  సహకారం అందించకపోవడంతో  ఎంఎల్ఏ, ఇంచార్జ్ పరిస్తితి పెనం నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది...ఇన్ని సంక్షేమ పధకాలు అమలు‌చేస్తున్నా ఈ స్థాయి నిరసనలు ఏమిటని నాయకులు తలలు‌పట్టుకుంటున్నారు... రోడ్లు, కాలవలు, పారిశుద్యం, త్రాగునీరు మొదలైన  మౌలిక‌‌ మౌలిక వసతుల‌‌ కోసం నియోజకవర్గానికి రూ.2 కోట్లు కేటాయించారు, ప్రతి సచివాలయానికి ప్రజలకు అవసరం అయిన మౌలిక‌ వసతుల కోసం రూ.20 లక్షలు కేటాయిస్తామని స్వయానా సీయం చెప్పినా నాయకులు ఎగిరి గంతేసి గడప గడప ద్వారా ప్రజలను కలిసే సహసం ‌చేయలేక పోతున్నారు. 


పథకాలు అందని వారి నుంచి ఆగ్రహం 


రైతు భరోసా కింద ఇస్తున్న పెట్టుబడి సాయం 13,500 భూ  యజమానులకే వెళ్తుంది. సాగు చేసే‌ వారిలో‌  75 శాతం మంది కౌలు రైతులే.. నష్టాలు, కష్టాలు, అర్థిక ఇబ్బందులు భరిస్తూ పంటను పండిస్తున్న నిజమైన కౌలు రైతుకు ఒక్క పైసా కూడా‌ అందటం లేదు.. . అలాగే పంటల బీమా కింద చెల్లిస్తున్న నష్ట పరిహారం కూడా కౌలు రైతులకు  చేరడం లేదు. పార్టీ కార్యకర్తలు, భూ యజమానులకే సింహభాగం చేరడంతో కౌలు రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దీంతో 35 లక్షల మంది కౌలు రైతు కుటుంబాల్లో ప్రభుత్వంపై అసహనం పెరిగింది. 
వాహన మిత్ర పథకం కింద సుమారు 2.5  లక్షల మందికి పది వేల చొప్పున మీట నొక్కి  సీయం  ఖాతాల్లో జమ చేశారు. ఆటో సొంతంగా నడుపుకునే వాళ్లకే ఇది వర్తిస్తోంది. ఆటో, క్యాబ్ సొంతంగా నడుపుకునే వాళ్లు 5 లక్షల మంది ఉంటారు. ఇందులో సగం మందికే వాహన మిత్ర దక్కింది. ఇక ఆటో డ్రైవర్లలో సగం మంది బాడుగకు తీసుకొని నడుపుకుంటున్నారు. వీళ్లకు పథకం వర్తించడం లేదు. వాళ్లలో ప్రభుత్వంపై తీవ్ర ఆక్రోశం నెలకొంది.


కార్పొరేషన్ల నుంచి నిలిచిపోయిన ఆర్థిక ాసయం ! 


అందరికీ ఇచ్చే పథకాలను కార్పొరేషన్ల కింద చూపిస్తున్నారు కానీ.. ప్రత్యేకంగా ఆయా కులాలకు ఎలాంటి సాయం చేయడం లేదు.  కుల వృత్తినే నమ్ముకొని ఇస్త్రీ పెట్టె పెట్టుకున్న రజకులకు పదివేల చొప్పున బటన్ నొక్కి వేస్తున్నారు. ఈ పథకం ద్నారా 88 వేల మందికి లబ్ధి పొందుతున్నారు. కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నోళ్లు 1.92 లక్షల మంది ఉన్నట్లు గతంలో ప్రభుత్వం తేల్చింది. ఇక ప్రతి ఊరిలోను వీధుల్లో బండి మీద ఇస్త్రీ చేసుకునే నిరుపేదలకు పథకం అందడం లేదు. అర్థికంగా స్థిరపడి  షాపు‌ ఏర్పాటు చేసుకొన్న వారికి మాత్రమే ఈ పథకం ఇస్తున్నారన్న అపవాదు ఉంది. కుల‌ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న  పేద వర్గాల‌  నాయీ బ్రాహ్మణులకు అసరా పథకం అందని ద్రాక్ష లాగే మారింది...లక్షలు ఖర్చు పెట్టి సెలూన్ ఏర్పటు చేసుకున్న వారికి మాత్రమే నాయి బ్రాహ్మణలకు  అందించే ఆసరా పధకం తద్వారా రూ.10 వేలు అందుతున్నాయి...కాని ఆదే సెలూన్ లో పని చేస్తున్న నిజమైన పేద నాయిబ్రాహ్మణునికి అందటం లేదని ఆయా వర్గాల‌ నుంచి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి...  ఇస్తున్న పదివేలు కూలికి చేస్తున్న వాళ్లకు దక్కడం లేదు. పెద్ద ఎత్తున అద్దెలు చెల్లిస్తూ సొంత షాపులు పెట్టుకున్నవాళ్లకే చేరుతోంది.   


ఈ అసంతృప్తి గురించి ప్రజల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలకు క్లారిటీ ఉంది. అందుకే గడప గడపకూ కార్యక్రమానికి వీలైనంత వరకూ దూరం పాటిస్తున్నారని అంటున్నారు.