Maharastra CM Eknath Shinde : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడిచింది. అయినా మహాయుతి తరఫున ముఖ్యమంత్రి పదవిని చేపట్టే వారి పేరు పై ఉత్కంఠ ఇంకా వీడలేదు.  రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సమస్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఇప్పట్లో ఖరారు కానప్పటికీ.. బీజేపీ నుంచి సీఎం వ్యక్తి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం.


తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం తన స్వగ్రామమైన సతారాలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన ముంబై చేరుకునే అవకాశం ఉంది. ఈ సాయంత్రంలోగా షిండే ముంబైకి రాకపోతే, మళ్లీ ఆయన అసంతృప్తిలో ఉన్నారని అర్థం చేసుకునే వీలుంది. షిండే మంత్రిగా ఆర్థిక, హోం శాఖలను కోరుతున్నారు. గత ప్రభుత్వంలో హోం, ఆర్థిక శాఖలు రెండూ ఉప ముఖ్యమంత్రి వద్ద ఉండేవి. ప్రస్తుతం బీజేపీ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.  డిప్యూటీ సీఎంతో పాటు ఆయనకు (షిండే) పీడబ్ల్యూడీని బీజేపీ ఆఫర్ చేసింది.


ఏక్‌నాథ్ షిండే తదుపరి అడుగుపైనే అందరి దృష్టి
మహారాష్ట్రలో సీఎం పేరు ఖరారు కానప్పటికీ ప్రమాణ స్వీకార తేదీ, స్థలం దాదాపు ఖరారయ్యాయి. డిసెంబర్ 5 మధ్యాహ్నం 1 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెబుతున్నారు. ఈ వేడుకను ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి ముందు, అందరి దృష్టి మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, తాత్కాలిక సీఎం షిండే తదుపరి చర్యలు, ఆయన భవిష్యత్ పైనే ఉంది.  మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గత రెండు రోజులుగా జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అతను తన స్వగ్రామమైన సతారాలో చికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు.


Also Read : Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !


ఏక్‌నాథ్ షిండే శుక్రవారం  స్వగ్రామానికి చేరుకున్నారు. షిండే సతారా వెళ్లడం వల్ల మహారాష్ట్రలో ఎన్డీయే ప్రతిపాదిత సమావేశం రద్దయింది. మహాయుతి ఈ సమావేశం ఈ రోజు అర్థరాత్రి ముంబైలో లేదా రేపు అంటే సోమవారం ఢిల్లీలో నిర్వహించనుంది. దీనిలో శాఖలపై చర్చించవచ్చు. నిన్న అంటే ఆదివారం నాడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి బీజేపీ వారేనని స్పష్టం చేశారు. మిత్రపక్షాల నుంచి డిప్యూటీ సీఎంలు బాధ్యతలను తీసుకుంటారని తెలిపారు. అయితే ఆ అధికారం ఎవరికి వస్తుందో మాత్రం అజిత్ పవార్ చెప్పలేదు.


బీజేపీకి 132 సీట్లు ఉన్నాయి కాబట్టి సీఎం కుర్చీ వారిదే - అజిత్
పూణేలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. మహాయుతి నాయకుల ఢిల్లీ సమావేశంలో బిజెపి ముఖ్యమంత్రి,  మిగిలిన రెండు పార్టీల ఉప ముఖ్యమంత్రులతో కలిసి మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగడం ఇదే మొదటిసారి కాదు. 1999లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక నెల పట్టింది. ఇక మంత్రిత్వ శాఖల విభజన విషయానికొస్తే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ విభజన చేసే పూర్తి హక్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. అప్పుడే మంత్రి వర్గం ఏర్పాటు అవుతుంది.


Also Read : Maharastra Elections: ఆసలైన శివసేన, ఎన్సీపీలు ఏవో తేల్చేసిన మహారాష్ట్ర ప్రజలు - ఇక థాక్రే, పవార్‌లకు రాజకీయ సన్యాసమేనా ? 


ఏదైనా మాకిష్టమే
అమిత్ షా, మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఆమోదయోగ్యమేనని ఏక్నాథ్ షిండే కూడా స్పష్టంగా చెప్పారని అజిత్ పవార్ అన్నారు. ప్రస్తుతం వారికి 132 సీట్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి వారిదే. షిండే కి కోపం లేదన్నారు అజిత్. ఇన్ని రోజులు ప్రచారంలో ఇరుక్కుపోయారు. విధులు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి శని, ఆదివారాలు పెద్దగా పని లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లిపోయారని అజిత్ పవార్ అన్నారు.