తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న కుటుంబసభ్యులను పరామర్శించారు. అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసేందుకు రెండు రోజులుగా పోలీసులు ఆయన ఇంటిని చుట్టు ముట్టారు. అయితే హైకోర్టు ఆయనపై నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలొద్దని ఆదేశించడంతో వెనుదిరిగారు. ఓ దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి విశాఖ వెళ్లిన లోకేష్ అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు నర్సీపట్నం వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆంద్రప్రదేశ్ లో రాజవరెడ్డి రాజ్యాగం అమలు అవుతుంతోనిద.. గుడివాడ లో కేసినో ఎర్పాటు చేసినా... ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేసిన నో పోలీస్ అని విమర్శించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎం మాట్లాడినా వాళ్ళను వదిలేస్తున్నారని కానీ టీడీపీ వాళ్లపై మాత్రం వేల కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
టీడీపీ కు చెందిన వారిపై 3250 కేసులు పెట్టారని ..33 టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్నారు. ఉద్యోగులు ఉద్యమాలు చేస్తే అశోక్ బాబును అరెస్ట్ చేశారు.. గంజాయి గురించి అడిగితే పట్టాభి ని అరెస్ట్ చేశారు.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ని ఎన్నోరకలుగా వేధించి ఆత్మహత్య కు ప్రేరేపించారని విమర్శించారు. అమరావతి చలో అసెంబ్లీ కు పిలిపునిస్తే గల్లా జయదేవ్ ను వేధించారు, ధర్మవరంలో, పులివెందుల లో, రామతీర్థం లో తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. చివరికి ఎవరికీ అపకారం చేయని అశోక్ గజపతిరాజు ను కూడా వేధించారన్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మరణం ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండ పెడుతున్నారని సాధారణ ప్రజలను కూడా వేధించారన్నారు. అయ్యన్నపాత్రుడు కేవలం యూజ్లెస్ ఫెలో అనే మాటలు మాత్రమే వాడారు ..అయ్యన్న మాట్లాడింది తప్పు అయితే మా అమ్మపైన మాట్లాడిన వాళ్ళను ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇది నర్సీపట్నం మా ఉక్రెయిన్ అర్థం కావడం లేదన్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రి అయ్యే నాటికి జగన్మోహన్ రెడ్డి పాలు తాగే వయసు కూడా ఉండి ఉండదని...అయ్యన్నపాత్రుడు స్పీడ్ ను మేము అందుకోలేక పోతున్నామన్నారు. ప్రభుత్వం అండ చూసుకొని విర్రవీగుతున్న వైసీపీ నేతలకు అధికారులు మా ప్రభుత్వం వస్తే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.విదేశాలకు పారిపోయినా పట్టుకుని వస్తామని రెండు చెంపలు వాయిస్తామని స్పష్టం చేశారు. రాజా రెడ్డి రాజ్యం అమలు చేసే నేతలు, అధికారులు పాత డీజీపీ కు పట్టిన గతి మర్చిపోవద్దని సూచించారు. 12 మంది సీనియర్లను కాదని కాదని కొత్త డీజీపీ నియమించారు . ఆయన రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతున్నానన్నారు. అయ్యన్న కుటుంబసభ్యులకు అండగా ఉంటామన్నారు.