Telangana formation has become strong for BJP :  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీ పెట్టుకుని ఆయన పోరాడారు. పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించి సకల జనుల మద్దతుతో రాష్ట్రం సాధించానని ఆయన చెబుతూ ఉంటారు. నిజంగానే ఆయనకు మద్దతుగా మొదట్లో ఏ రాజకీయ పార్టీ లేదు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత తప్పనిసరిగా చాలా పార్టీలు మద్దతు ప్రకటించాయి కానీ.. మజ్లిస్ పార్టీ మాత్రం .. ప్రత్యేక తెలంగాణ వద్దే వద్దని వాదించారు. అంతగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనుకుంటే రాయలసీమను కూడా కలుపుకోవాలని సూచించింది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అదే చెప్పారు. మజ్లిస్ ప్రధాన అభ్యంతరం ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పడితే ఖచ్చితంగా బీజేపీ బలపడుతుందనే. ఆ అభ్యంతరాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోని కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించింది. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అంచనాలు నిజమవుతున్నాయి. ఎలా అంటే చివరికి రాష్ట్రం కోసం పోరాడిన బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీలో కలిసిపోయేందుకు రెడీ అవుతోందని ఆయన కూడా నమ్ముతున్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ పాత్ర నామమాత్రం


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎప్పుడూ బలమైన పాత్ర పోషించలేదు. పొత్తులు పెట్టుకున్నప్పుడు మాత్రం ఉనికిని ఘనంగా చాటేది. కానీ సొంతంగా ఎప్పుడూ పెద్దగా సీట్లు సాధించింది లేదు. పొత్తులు లేనప్పుడు అతి కష్టం మీద కిషన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచేవారు. టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ 1998లో నాలుగు, 1999లో ఏడు లోక్ సభ సీట్లను గెల్చుకుంది. పొత్తులు లేనప్పుడు 2004, 2009లో ఒక్క సీటు కూడా రాలేదు. ఓటు బ్యాంక్ కూడా మూడు శాతం కన్నా దిగువ ఉంది. 2009లో ఒంటరిగా పోటీ చేసి 2.84 శాతం ఓట్లనే తెచ్చుకుంది. అంటే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో బలమైన నేతలు ఉన్న కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తప్ప మిగతా ఎక్కడా ప్రభావం చూపించలేదన్నమాట. 


ఏపీ రాజధానిలో రియల్ ఎస్టేట్ భూమ్ - నెలలో రెట్టింపయిన ధరలు !


విభజన తర్వాత తెలంగాణలో అనూహ్యంగా బలపడిన  బీజేపీ


రాష్ట్ర విభజన అంటూ జరిగితే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీకి భారీగా నష్టం జరుగుతుందని బీజేపీ బలపడుతుందని అంచనా వేశారు. అయితే టీడీపీ బలహీనపడటానికి బీజేపీ బలపడటానికి సంబంధం లేదు. టీడీపీకి నాయకత్వ సమస్య వస్తుంది.. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా మారుతుంది. కానీ బీజేపీ బలపడటానికి మాత్రం కారణం.. మజ్లిస్ చీఫ్ ఓవైసీ భయపడిన కారణాలే. ముస్లిం జనాభా తెలంగాణలో ఎక్కువే. బీజేపీ రాజకీయాలు ఆ వ్యూహాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. రాష్ట్రం ఏర్పడిన మొదటి సారి జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు  పెట్టుకుని బీజేపీ పోటీ చేసింది. ఆ పార్టీది మైనర్ పార్టనర్ హోదాలే. అత్యధిక స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. 46 చోట్ల బీజేపీ పోటీ చేసి ఐదు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.  2018 నాటికి ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానానికే పరిమితమయింది. 2023లో ఎనిమిది సీట్లకు పెరిగింది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఘనమైన విజయాలు సాధించింది. 2019లో 19 శాతం ఓటు షేర్ తెచ్చుకుంటే.. 2024లో 35 శాతానికి పెంచుకుంది. టీడీపీ పూర్తిగా పోటీ చేయలేని పరిస్థితుల్లోకి రాగా.. బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమయింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ .. హాట్ ఫేవరేట్. కాంగ్రెస్ తర్వాత స్థానం ఆ పార్టీదే. 


బీఆర్ఎస్‌కు బీజేపీతో కలసిపోక తప్పని పరిస్థితులు


బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ తో  పొత్తులు పెట్టుకోవడం లేదా విలీనం  అవ్వడం అన్న అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఢిల్లీలోనూ విస్తృంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన డీల్ పూర్తయిందని అంటున్నారు. అదే జరిగితే ఇక తెలంగాణలో పోరాటం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోతుంది నిజానికి బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఓట్లు చీల్చుకోగలదు కానీ వాటికి పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. కలసిపోతే... అధికారిక ముఖాముఖి జరుగుతుంది. ఇదే మజ్లిస్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. బీజేపీ తెలంగాణలో ఎదకూడదని ఓవైసీ బలంగా కోరుకుంటారు. కానీ .. బీఆర్ఎస్ చీఫ్.. ఆ పార్టీ ఎదుగదలకు కారణం అవుతున్నారు. అదే అసంతృప్తిని ఆయన బయట పెట్టారు. ప్రత్యేక తెలంగాణకు తాను మద్దతివ్వనిది అందుకేనని.. తాను ఎది భయపడ్డానో అది జరుగుతోందని ఆయన ఆందోళన. 


శ్రీవాణి టిక్కెట్లు కొని తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా ? - ఈ విషయం తెలుసుకోవాల్సిందే


కాంగ్రెస్ వ్యూహాత్మక లోపమే అసలు కారణం ! 


చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే తాము  బలపడతామని బీజేపీకి తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీకి ఏక్‌థమ్ మద్దతు పలికింది. కానీ కాంగ్రెస్ మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తమ పుట్టి మునుగుతుందని అంచనా వేయలేకపోయింది. ఇప్పటికీ ఏపీలో కదలిక లేని స్థితిలో ఉండగా.. అతి కష్టం మీద పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు.