YSRCP: వైఎస్ఆర్‌సీపీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నప్పటి నుంచి సానుకూలంగా ఒక్క ఘటన కూడా జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు మరింత వరస్ట్ గా మారుతున్నాయి. ఎంతగా అంటే సోషల్ మీడియా టీం మొత్తం కకావికలం అయిపోయింది. ఎవర్నీ గట్టిగా కాపాడుకోలేని పరిస్థితి. ఆయా సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టుల వల్ల అరెస్టులపై ప్రజల్లో వ్యతిరేకత కూడాలేదు. అలాంటి వారిని శిక్షించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ అసెంబ్లీకి వెళ్లబోనని చెబుతున్నారు. కనీసం ఎమ్మెల్యేలను కూడా వెళ్లవద్దని చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీకి మేలు చేస్తాయని ఆ పార్టీ నేతలు గింజుకుంటున్నారు.
వరుసగా వ్యూహాత్మక తప్పిదాలు
అసెంబ్లీకి వెళ్లం అని చెప్పడానికి .. ప్రజలను కన్విన్స్ చేయడానికి బలమైన కారణాలు ఉండాలి. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంలేదు.. మాట్లాడేడందుకు మైక్ ఇవ్వరు అన్న కారణంగా తాను అసెంబ్లీకి రానని..మీరు కూడా వెళ్లవద్దని జగన్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. తాము అయినా వెళ్తమని కొంత మంది ఎమ్మెల్యేలు అడిగినా జగన్ అంగీకరించలేదు. మాట్లాడే చాన్స్ రాదు కాబట్టి వెళ్లవద్దని ఆయన స్ఫష్టం చేశారు. అసలు వెళ్తేనే కదా మైక్ ఇస్తారా లేదా అన్నది తెలుస్తుందని కొంత మంది అభిప్రాయం. అయితే జగన్ మాత్రం వెళ్లవద్దని తేల్చేశారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం చెప్పుకోవాలని వారు ఆవేదన చెందుతున్నారు.
Also Read: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
సోషల్ మీడియాను కంట్రోల్ చేయక మరిన్ని సమస్యలు
అధికారంలో ఉన్నంత కాలం ఏం జరిగిదంన్న విషయం పక్కన పెడితే ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అవే బూతులు, దాడులు చేస్తే.. ఊరుకునే పరిస్థితి ఉండదు. అధికారం వారి చేతుల్లో ఉండదు. అలా చేయడం వారిని రెచ్చగొట్టడం అవుతంది. పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికి అయినా కొన్నాళ్లు సోషల్ మీడియా దూకుడును తగ్గించి ప్రజాస్వామ్య యుతంగాఉండేలా చూసుకోవాల్సి ఉంది. కానీ టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని భావించి మెల్లగా పాత తరహాలో పోస్టులు, మార్ఫింగ్‌లు ప్రారంభించారు. సమయం చూసి టీడీపీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. ఇప్పుడు మొత్తం ఇరుక్కుపోయారు. ఎంత పోరాటం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
జగన్ చుట్టూ ఉండే కోటరీ వల్లే ఇదంతా జరుగుతోందా ?
జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీ వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని ఎక్కువ మంది ఆ పార్టీలో చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్తే.. ఒక వేళ టీడీపీ ఎమ్మెల్యేలు అనమానిస్తే అది జగన్ కే ప్లస్ అవుతుందని ఓ మాదిరి రాజకీయం గురించి తెలిసిన వారు కూడా చెబుతారు. అసలు ఓడిపోతామని యుద్ధానికి ఎందుకని ముందుగానే ఇంట్లో కూర్చోవడం ఎవరి సలహా అని వారు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాపై చర్యలు తీసుకోలేని టీడీపీ ప్రభుత్వం అన్న అభిప్రాయాన్ని కూడా కల్పించింది సలహాదారుల నిర్ణయాలేనని భావిస్తున్నారు. మొత్తంగా సలహాదారులు జగన్ మోహన్ రెడ్డిని .. వైసీపీని నిండా ముంచేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జగన్ తన కోటరీని ఎంత త్వరగా దూరం పెడితే పార్టీ అంత బాగు పడుతుందని వారనుకుంటున్నారు.