Kodali Nani : హైదరాబాద్‌లో కేసినో నిర్వాహకులు చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఏపీ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. గత సంక్రాంతికి గుడివాడలో భారీ ఎత్తున కేసినో నిర్వహించారు. ఈ కేసినోను నిర్వహించింది చీకోటి ప్రవీణ్ అని వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ నివేదిక బయటకు రాలేదు. ఇప్పుడు ఆ చీకోటి ప్రవీణ్‌పై ఈడీ దాడులు జరగడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ విమర్శలు ప్రారంభించారు.
తిరుపతిని సర్వనాశనం చేశారు - వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై అశ్వనీదత్ విమర్శలు
మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నేతృత్వంలోనే.. చికోటి ప్రవీణ్ గుడివాడలో కెసీనో నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. నేపాల్ కెసీనోకు వెళ్లినవారిలో సగం మంది వైఎస్ఆర్‌లీపీ నేతలేనని ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి నేపాల్ కెసీనోకు వెళ్లిన.. ప్యాసింజర్స్ లిస్టు బయటపెట్టే ధైర్యం ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారా? భట్టి విక్రమార్క రియాక్షన్ ఇదీ
క్యాసినోకు ఎంట్రీ ఫీజుగా రూ.10 వేలు వసూలు చేశారని.. 18 వేల మంది ఇందులో పాల్గొనడంతో.. ఎంట్రీ ఫీజు రూపంలోనే రూ.180 కోట్లు ఆర్జించారని వర్ల రామయ్య ఆరోపించారు. క్యాసినో ద్వారా నిలువు దోపిడీ జరిగిందన్నారు. ఈ డబ్బంతా కొడాలి, ఆయన సన్నిహితులకు వెళ్లిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్, వైఎస్సార్సీపీ నేతల్లో ఈడీ సోదాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.వైసీపీ నేతల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు. కెసీనో ద్వారా కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానని వర్ల రామయ్య ప్రకటించారు.
కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి - లెక్కలు రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !
అయితే టీడీపీ నేతల ఆరోపణలను కొడాలి నాని తోసి పుచ్చారు. దమ్ముంటే ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని ఆయన సవాల్ విసిరారు. చికోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. గుడివాడలో క్యాసినో జరిగిందంటూ.. రోజుల తరబడి ప్రచారం చేశారన్న నాని.. అంశంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి సమర్పించాలని డిమాండ్ చేశారు. చికోటి వ్యవహారాన్ని తమకు ఆపాదించడం సరికాదన్నారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా, చికోటిపై ఈడీ తనిఖీలను టీడీపీ బ్యాచ్ తమకు ఆపాదిస్తోందన్నారు.