Fact Check CM Jagan : నోట్ల ముద్రణపై జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమైనవేనా ? ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఏం చెబుతోందంటే ?

నోట్ల ముద్రణపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పందించింది.

Continues below advertisement

Fact Check CM Jagan :  డబ్బులు ప్రింట్ చేసే కేంద్రం వద్దే డబ్బు లేదంటే ఎలా అని సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో అన్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఈ వీడియోను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి నోట్లు ఎప్పుడు ముద్రిస్తారో కూడా తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ వివరణ ఇచ్చారు. ఓ చిన్న ఎడిటెడ్ క్లిప్ మాత్రమే సీఎం జగన్ మాట్లాడిన దానికి సంబంధించి ప్రదర్శిస్తున్నారని కానీ పూర్తి మొత్తం చూడాలని ఫ్యాక్ట్ చెక్ ఏపీ సూచించింది. 

Continues below advertisement

కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి - లెక్కలు రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !


ఆ మేరకు సీఎం జగన్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. మొత్తం చూసిన తర్వాత సీఎం జగన్ ఏ ఉద్దేశంతో అలా అన్నారో తెలుసుకోవాలని సూచించింది. పోలవరం నిర్వాసితులకు అర్థమయ్యేలా చాలా సింపుల్ వర్డ్స్‌తో సీఎంజగన్ అలా వ్యాఖ్యానించారని తెలిపింది. 

 

సీఎం జగన్ దెబ్బకి హడలిపోయిన వైసీపీ ఎమ్మెల్యే, గడప గడపకు భారీ హంగామా !

అయితే ఫ్యాక్ట్ చెక్ ఏపీ ట్విట్టర్ హ్యాండిల్‌ పోస్ట్ చేసిన వీడియోలనూ సీఎం జగన్ అదే చెప్పారు. అయితే జగన్ ఏ ఉద్దేశంతో చెప్పారో తెలుసుకోవాలని ఫ్యాక్ట్ చెక్ నిర్వాహకులు చెబుతున్నారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola