Does YS Jagan have to fight against BJP : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఆయనకు ఇండీ కూటమి నేతలంతా ఏకపక్షంగా మద్దతు పలికారు. షర్మిల ఫీల్ అవుతుందనో మరో కారణమో కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. కానీ కూటమి నుంచి నేతలంతా వచ్చారంటే.. వ్యూహాత్మకమేనని అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు మరో దారి లేదు. ఆయన ఖచ్చితంగా ఇండీ కూటమి దారిలో వెళ్లాలి. బీజేపీకి మద్దతుగా ఇక ఎంత మాత్రం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే .. కష్టాల్లో ఇంతగా మద్దతుగా ఉన్న ఇండీ కూటమిని కాదని బీజేపీ దగ్గరకు వస్తే అటు బీజేపీ అనుమానిస్తుంది.. ఇటు కాంగ్రెస్ కూటమి ఆగ్రహిస్తుంది. అందుకే జగన్ అన్నీ ఆలోచించుకునే ఇండీ కూటమి నేతల్ని ధర్నాకు మద్దతుగా ఉండాలని ఆహ్వానించినట్లుగా భావిస్తున్నారు.
అనివార్యంగా ఇండియా కూటమితోనే ఇక పయనం !
ఇండియా కూటమిలో చేరాలని జగన్మోహన్ రెడ్డిని సంఘిభావం తెలియచేయడానికి వచ్చిన పార్టీల నేతలంతా ఆహ్వానించారు. దీనిపై జగన్ స్పందన ఏమిటన్నదానిపై స్పష్టత లేదు కానీ ఆయన గతంలోలా బీజేపీకి మద్దతు పలికే అవకాశం లేదు. 2014 నుంచి జగన్ బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. 2014లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ ఆయన పరోక్షంగా బీజేపీతో సంబంధాలు కొనసాగించారు. ఈ కారణంగా బీజేపీ, టీడీపీ మధ్య అభిప్రాయభేదాలు వచ్చి .. చంద్రబాబు కూటమి నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు బీజేపీకి పరోక్షంగా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండగలరు కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకోలేరు. ఎందుకంటే ఆయన ఓటు బ్యాంక్ పూర్తిగా దళిత, ముస్లింలు, బీజేపీతో పరోక్షంగా స్నేహాన్ని మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వారు సమర్థించి ఓట్లు వేసి ఉండవచ్చు కానీ నేరుగా పొత్తులు పెట్టుకుంటే మాత్రం ఓటు వేయరు. అందుకే నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆయన వెనుకాడారు. ఇప్పుడు ఇండీ కూటమికి దగ్గరవుతుతున్నారు. ఇండీ కూటమి ఆయనకు ఓటు బ్యాంక్ పరంగా సేఫ్. కానీ బీజేపీని కాదంటే జరగబోయే పరిణామాల్ని ఎదుర్కోవడం కష్టమని ఇంత కాలం ఆయన ఆ పార్టీ పట్ల భయభక్తులతో ఉన్నారని అనుకోవచ్చు. కానీ ఢిల్లీ ధర్నా తర్వాత ఆయన అనివార్యంగా ఇండియా కూటమితో నడవక తప్పదు.
వైఎస్ఆర్‌సీపీకి ఇండియా కూటమి పార్టీల మద్దతు - జగన్ కాంగ్రెస్‌కు దగ్గరయినట్లేనా ?
ఏ విషయంలో అయినా బీజేపీకి మద్దతిస్తే రెంటికి చెడ్డ రేవడి
కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తామని గతంలో జగన్ ప్రకటించారు. అయితే ఇక ముందు ఎలాంటి అంశమైనా వైసీపీ తరపున ఆయన వ్యతిరేకించాల్సిందే. లేకపోతే బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఇండి కూటమి నేతలు అనుకుంటారు. కేంద్రంలో బీజేపీపై పోరాటంలో ఇండీ కూటమికి జగన్ మద్దతు ప్రకటించకపోతే.. ఆయనకు ఇక ఏ విషయంలోనూ ఆ వైపు నుంచి సపోర్టు రాదు. ఇప్పుడు మద్దతు ప్రకటించినందుకు వారు చింతించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఆయన ఎలాగూ సపోర్టు రాదు. కూటమిలో టీడీపీ, జనసేన ఉంటాయి. అయితే బీజేపీతో ఆయన పరోక్ష సంబంధాలను కొనసాగించవచ్చు. కానీ దాని వల్ల ఆయనకు ఎంత లాభం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే. అంటే.. ఢిల్లీ ధర్నాలో తనకు సంఘిభావం తెలిపిన ఇండీ కూటమిని కాదని.. ఆయన బీజేపీకే మద్దతుగా ఉంటానని వెళ్తే.. రెంటికి చెడ్డ రేవడి అవుతారు.
జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణ - తర్వాత ఈడీ కి సిఫారసు - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన
ప్లాన్ ప్రకారమే చేశారా ? ఇరుక్కుపోయారా ?
ఢిల్లీలో ధర్నా చేయాలని జాతీయ పార్టీల మద్దతు కోరాలని జగన్ ఎందుకు అనుకున్నారో కానీ.. ఇప్పుడు ఆయన ఇరుక్కుపోయారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతల్ని పిలిచి ధర్నా చేశారు. కాబట్టి ఆయనను బీజేపీ ఎంత మాత్రం ఇక ఆదరించదు. పైగా .. చంద్రబాబు ప్రభుత్వంపై .. జాతీయ స్థాయి నేతల్ని పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర స్థాయిలో పోరాడవచ్చు. కానీ జగన్ ఢిల్లీ ధర్నా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఓ స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నికలు ముగిసి రెండు నెలలే కాబట్టి.. దాదాపుగా ఇంకా నాలుగున్నరేళ్లకుపైగానే ఆయన బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంంటుంది. ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గలేరు. యుద్ధబరిలో దిగినట్లే అనుకోవచ్చు..