మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి జూపల్లి, పొంగలేటి నివాసాలకు వెళ్లి సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని వారి వారి నివాసాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.
అత్తపూర్‌లో ఉన్న జూపల్లి కృష్ణారావు ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ ఆయన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో ఉన్న పొంగులేటి ఇంట్లో ముగ్గురు సమావేశంకానున్నారు.
పొంగులేటి ఇంటికి రేవంత్, జూపల్లితోపాటు పార్టీ ముఖ్యులు మరికొందరు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడే లంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు చేరిక ఎప్పుడు సభ ఎక్కడ వంటి వాటిపై కూడా మాట్లాడబోతున్నారు.
ఈ ముగ్గురు సమావేశంలో చర్చించుకున్న అంశాలపై ఢిల్లీ అధిష్ఠానికి నివేదిక సమర్పించబోతున్నారు రేవంత్. పొంగులేటి, జూపల్లితోపాటు మరికొందరు చేరికపై కూడా చర్చించనున్నారు. రాహుల్‌తో గురువారం రేవంత్ సమావేశమవుతారని... తెలంగాణలో పర్యటనపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఈ నెలాఖరుకల్లా చేరికలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇది ఆలస్యమైతే రాహుల్ గాంధీతో పొంగులేటి బ్యాచ్ కలిసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. ఆ భేటీ తర్వాత అధికారక ప్రకటన రావచ్చని టాక్ నడుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ వచ్చింది. డీకే శివకుమార్- సిద్ధరామయ్యల స్ఫూర్తితో సీనియర్ లీడర్లు అంతా కలిసి పని చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలా లీడర్లు అంతా కలిసి పాల్గొంటున్నారు. ఆపరేషన్ కమలం పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఆపరేషన్ హస్తం స్పీడ్ అందుకుంది. పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు పార్టీలో చేరేలా మంతనాలు పూర్తి చేశారు. వీరితో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డి సైతం హస్తం పార్టీకి టచ్‌లోకి వచ్చారు. తాండురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇలా బీఆర్ఎస్ కు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందనే సంకేతం.. ఇతర పార్టీల్లోని నాయకులకు పంపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.
పొంగులేటి అనుచరవర్గం అంతా కాంగ్రెస్ లోకే !
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట చాలామంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వెంట ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
జూపల్లికి సొంత బలగం - అంతా కాంగ్రెస్ లోకే