YS Jagan On Opposition :   వరద బాధితులకు శక్తివంచన లేకుండా సాయం చేస్తున్నా విమర్శలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలపై ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడు అంటూ అభివర్ణించే అయన ఈ సారి కొత్తగా పేరు పెట్టి మరీ విమర్శించారు.  వ‌ర‌ద‌ల్లో విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం,అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని..  చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌ పై ఆయన విమర్శలు గుప్పించారు. అనుకూల మీడియా సాయంతో  బురదజల్లుతున్నారు అని అన్నారు .వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 


వెంకయ్య రాజకీయ శకం ముగిసినట్లేనా ? రిటైర్మెంటే మిగిలిందా?


కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకే ప్రభుత్వంపై నిందలు


కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నరాని  బురదజల్లడానికి నానారకాలుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సరిగ్గా సహాయ చర్చలు లేవని.. కనీసం ముంపు ప్రాంతాలకు సమాచారం కూడా ఇవ్వలేదని ఫలితంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారని.. వారికి కనీసం ఆహారపొట్లాలు కూడా ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కూడా ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోయారని.. బాధితులకు భరోసా ఎవరు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 


"అవాక్కయ్యే" ప్రకటనలు నేతలు ఎందుకు చేస్తారు ? నిజంగానే తెలియదా ? కన్ఫ్యూజ్ చేయడానికా ?


వరద బాధితులకు సాయం చేయడం లేదని వెల్లువెత్తుతున్న విమర్శలు


ఈ విమర్శలు పెరిగిపోవడంతో  సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించినట్లుగా తెలుస్తోంది. వారంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే  ఎప్పుడూ లేని విధంగా పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడు అని కాకుండా నేరుగా పవన్ అని సంబోధించడంలో ఏైనా రాజకీయం ఉందా అన్న చర్చ కూడా ప్రారంభమయింది. ఎప్పట్లాగే ఆయన కొన్ని మీడియా సంస్థలతో పాటు చంద్రబాబు,  పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. 


ల్‌లో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉందేమో? సీఎం క్లౌడ్ బరస్ట్ కామెంట్స్‌పై కొండా లాజికల్ కౌంటర్


దత్తపుత్రుడిగా కాకుండా పవన్ కల్యాణ్‌గానే  జససేనాని పేరు ప్రస్తావన 


కానీ విమర్శల్లో మాత్రం తేడా కనిపిస్తోంది. అందుకే వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాడేపల్లిలో కూర్చుని సమీక్,లు చేయడం కాదని.. ఎందుకు క్షేత్ర స్థాయిలో వరదల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వడంలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


వచ్చే 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రూ.2వేలు, రేషన్‌: సీఎం జగన్ ఆదేశాలు