ఆంధ్రప్రదేశ్ బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి జోనల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను వేయడానికి వీలుగా ముందుగా ఇంచార్జ్‌ను నియమిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పోలింగ్ బూత్‌లకు ఇంచార్జ్‌లను నియమించారు. ప్రతి మూడు లేదా ఆరు పోలింగ్‌బూత్‌లకు ఓ శక్తి కేంద్రంను ఏర్పాటు చేస్తున్నరు. వాటికి ప్రముఖ్‌లను నియమించి జిల్లాల వారీగా శక్తి కేంద్ర ఇంచార్జులతో 26 జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేశారు.
పోలింగ్ బూత్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశించింది. అందుకే శక్తికేంద్రాల ఏర్పాటును టార్గెట్‌గా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో 15 వేల శక్తి కేంద్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంతో సోము వీర్రాజు పని చేస్తున్నారు. ఆరు నెలల కిందట జోనల్ స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో ప్రాంతీయ సదస్సులు నిర్వహించిన రాష్ట్ర పార్టి, ఇప్పుడు క్షేత్ర స్థాయి పార్టీ బాధ్యులతో ప్రాంతాల వారీగా సమావేశాలను ప్రారంభిస్తోంది. బుధవారం నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి.
పీకే, ఐ ప్యాక్ సేవలు వైఎస్ఆర్‌సీపీ తీసుకోవడం లేదు - సజ్జల కీలక ప్రకటన
27 వ తేదీ ఉత్తరాంధ్ర జోనల్ సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం విజయనగరం, అరకు,పాడేరు & పార్వతీపురం జిల్లా నుండి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులను ఆహ్వానించారు. 28వ తేదీన న 'రాజమహేంద్రవరం'లో జరుగనున్న "గోదావరి జోన్" సమావేశంలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, ఏలూరు & కృష్ణా జిల్లాల నేతలు పాల్గొంటారు. 'గుంటూరు'లో 29 న జరుపనున్న "కోస్టల్ జోన్" సమావేశానికి విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల,-ఒంగోలు, నెల్లూరు తిరుపతి జిల్లాలకు చెందిన నేతలు పాల్గొంటారు. ఈ నెల 30 న 'అనంతపురం'లో అనంతపురం, హిందూపురం,చిత్తూరు, కడప,రాజంపేట, కర్నూలు, నంద్యాల నిర్వహిస్తున్న "రాయలసీమ జోన్" సమావేశంతో ప్రాంతీయ స్థాయి సదస్సులు పూర్తి కానున్నాయి.
పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే వల్ల గర్భవతి అయ్యా, కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు!
ఈ ప్రాంతీయ స్థాయి సమావేశాలకు మండల పార్టీ అధ్యక్షులు,ఇంఛార్జ్ లు,జిల్లా పార్టీల అధ్యక్షులు,జిల్లా పదాధికారులు, మోర్చాల జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్సులు,జిల్లా స్థాయి సెల్స్ కన్వీనర్, కో కన్వీనర్లు, జిల్లా స్థాయి డిపార్ట్మెంట్స్ ప్రముఖులు, సహ ప్రముఖులు హాజరయ్యే విధంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీల్ని నియమిస్తే పార్టీ బలోపేతం సులువని బీజేపీ భావిస్తోంది.