Andhra Pradesh CM Relief Fund: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న వేళ వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం ఏపీ ప్ర‌భుత్వం ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావాల‌ని ఎక్స్ లో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం హ్యాండిల్ నుంచి విజ్ఙ‌ప్తి చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పంపాల‌ని కోరుతూ ఒక క్యూర్ కోడ్ ఫొటోను కూడా అటాచ్‌మెంట్ లో ఉంచారు. వ‌ర‌దల్లో చిక్కుకున్న బాధితుల క‌ష్టాల‌ను అర్థం చేసుకుని వారు కోలుకునేందుకు మ‌నందరం అండ‌గా నిల‌వాల‌నే స్ఫూర్తి పెంపొందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. బ్యాంకుల నుంచి జ‌మ చేయాల‌నుకునే దాత‌ల కోసం వెల‌గపూడి స‌చివాలయం బ్రాంచ్‌కు చెందిన స్టేట్ బ్యాంక్ ఇండియా, యూనియ‌న్ బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్లను అందులో  పొందుప‌రిచారు.


Also Read: విరాళం ఇవ్వడంలోనూ ప్రభాస్‌ బాహుబలే... అల్లు అర్జున్ కూడా - ఈ హీరోలు ఏపీ, తెలంగాణకు ఎన్నేసి కోట్లు ఇచ్చారంటే?


గ‌త వారం రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ ప్రాంతం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఇల్లు మునిగిపోయి వేల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వాధికారులు శ్ర‌మిస్తున్నారు. ఎంత శ్ర‌మించినా రిమోట్ ఏరియాల్లో ఉన్న‌వారికి స‌హాయ‌క చ‌ర్య‌లు అంద‌డంలో జాప్యం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే డ్రోన్లు, హెలిక్యాప్ట‌ర్ల‌ను రంగంలోకి దించి ఆహారం, నీరు అందిస్తోంది. కొంత‌మంది స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి సేవ‌లందిస్తున్నారు.  పునరావాస శిబిరాల‌కు బాధితుల‌ను త‌ర‌లిస్తున్నారు. బోట్లు దొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్తితులు ఉండ‌టంతో ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వ‌ర‌ద కొద్దికొద్దిగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌లు వేగం పుంజుకున్నాయి. కొంత‌మంది బాధితులు స్వ‌చ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు స్వ‌చ్ఛందంగా యువ‌కులు ముందుకొస్తున్నారు. వ‌ర‌ద‌ బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు అక్క‌డ‌క్కడా పున‌రావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 


విరాళాలు ప్ర‌క‌టించిన రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు


1. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రూ. కోటి విరాళం ప్ర‌క‌టించారు. దీంతోపాటు ల‌క్ష పాల ప్యాకెట్లు, మ‌రో 2 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 


2. ముఖ్య‌మంత్రి సతీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, హెరిటేజ్ ఫుడ్స్ వైఎస్ చైర్ ప‌ర్స‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆ సంస్థ త‌ర‌ఫున ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు కోటి చొప్పున రూ. 2 కోట్ల విరాళం ప్ర‌క‌టించారు. 


3. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రెండు రాష్ట్రాల‌కు రూ. 2 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. 
4. అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ. కోటి విరాళం ప్ర‌క‌టించారు. 
5. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
6. జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ. 50 లక్షల చొప్పున ప్రకటించారు.
7. కల్కి నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు ప్రకటించారు.
8. మహేష్ బాబు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ. 50 లక్షల చొప్పున ప్రకటించారు.
9. ఆయ్ మూవీ యూనిట్ – ఈ వారం అంతా వచ్చే కలెక్షన్స్ లో 25 శాతం ఏపీ రిలీఫ్ ఫండ్ కు ప్రకటించారు.
10. త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాలకు రూ. 25 లక్షల చొప్పున ప్రకటించారు.
11. సిద్ధూ జొన్నలగడ్డ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి రూ. 15 లక్షల చొప్పున ప్రకటించారు.
12. విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి రూ. 5 లక్షల చొప్పున ప్రకటించారు.
13. నంద‌మూరి బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ప్రకటించారు.
14. డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 5 లక్షల చొప్పున ప్రకటించారు.
15. అనన్య నాగళ్ళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 2.5 లక్షల చొప్పున ప్రకటించింది.
16. యాంకర్ స్రవంతి లక్ష రూపాయల చొప్పున ఏపీ, తెలంగాణ‌కు విరాళం ప్రకటించింది.
17. బీఎస్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ.1 కోటి 
18. సినీ నిర్మాత అశ్వనీదత్ రూ.25 లక్షలు 
19. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.25 లక్షలు (విజయవాడ)
20. సిద్ధార్థ వాకర్స్ క్లబ్ రూ.5 లక్షలు (విజయవాడ)
21. టీడీపీ మహిళా నాయకురాలు రాయపాటి శైలజ రూ.5 లక్షలు (గుంటూరు)
22. డాక్టర్ ఐ.నలినీ ప్రసాద్ రూ.1 లక్ష (విజయవాడ)
23. పొట్లూరి విజయ్ కుమార్ రూ.1 లక్ష (విజయవాడ)
24. అల్లూరి అచ్యుతరామరాజు రూ.1 లక్ష (కైకలూరు)
25. వల్లభనేని రవి రూ.1 లక్ష విరాళం అందించారు. 


Also Read: చిరంజీవి 'మెగా' విరాళం... ఏపీ, తెలంగాణలో సహాయక చర్యలకు ఎంత ఇచ్చారంటే?


ఈ మేరకు సంబంధిత చెక్కులు, నగదును సీఎం చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకొని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.