రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు... ఆఫ్ స్క్రీన్ కూడా బాహుబలి. ఈ పాన్ ఇండియా స్టార్ హీరో మనసు నిజ జీవితంలోనూ 'బాహుబలి' అంత పెద్దది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రాష్టాల ప్రభుత్వాలు భారీ ఎత్తున చేపడుతున్న సహాయక చర్యలకు ఆయన విరాళం ప్రకటించారు.


రెండు కోట్లు ఇచ్చిన ప్రభాస్...
ఐదు కోట్లు ఇచ్చారనేది ఫేక్!
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ ఐదు కోట్లకు ఇచ్చారని, ఇరు ప్రభుత్వాలకు రెండేసి కోట్లు చొప్పున సాయం అందించారని బుధవారం ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరిగింది. కొన్ని న్యూస్ ఛానళ్లు సైతం నిజానిజాలు ఏమిటి? అనేది నిర్ధారించుకోకుండా కథనాలు ప్రసారం చేశాయి. అయితే... అవన్నీ ఫేక్ న్యూస్ ప్రభాస్ టీమ్ వివరణ ఇచ్చింది. కాసేపటి తర్వాత ప్రభాస్ రెండు కోట్లు విరాళం ఇచ్చారనే విషయం వెల్లడించారు.






విరాళాలు వెల్లడిలో అల్లు అర్జున్ సైతం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం బుధవారం తన విరాళం ఎంత అనేది అనౌన్స్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ఇచ్చారు. మొత్తం మీద ఆయన విరాళం కోటి రూపాయలు.






టాలీవుడ్ హీరోల్లో హయ్యస్ట్ డొనేషన్!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మంగళవారం ఉదయం నుంచి విరాళాల వెల్లువ మొదలైంది. తొలుత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోటి ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి చెరొక రూ. 10 లక్షల చొప్పున విరాళం వచ్చింది. త్రివిక్రమ్, చినబాబు, నాగవంశీ కలిసి రూ. 30 లక్షలు, సిద్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షలు ఇచ్చారు.


Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు



గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏపీ డిప్యూటీ సీఎం - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం కోటి చొప్పున విరాళాలు ఇస్తున్నట్టు నిన్న (మంగళవారం) అనౌన్స్ చేశారు. హీరోయిన్ అనన్య నాగళ్ల రూ. 5 లక్షలు, యాంకర్ స్రవంతి చొక్కారపు రూ. లక్ష విరాళం ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన విరాళాలు అన్నిటిలో హయ్యస్ట్ డొనేషన్ ప్రభాస్ దే.


Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే