ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలపై ఆ పార్టీ అధినేత దృష్టి సారించిన సమయంలోనే తెలుగుయువత నేతలు కొత్త నినాదంతో తెరపైకి వచ్చారు. కల్యాణదుర్గం నియోజకవర్గానికి తక్షణం ఇంచార్జిని నియమించి పార్టీని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  కళ్యాణదుర్గంలో సేవ్ టీడీపీ నినాదాన్ని తెలుగు యువత నాయకులు ప్రారంభించారు. ఇక్కడ మూడు గ్రూపులుగా ఏర్పడి టిడిపి పార్టీని నాశనం చేస్తున్నారని తెలుగు యువత నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మూడు గ్రూపులకు ఈ తెలుగుయువత నేతలకు సంబంధం లేదు. 


దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం, సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు


వీరంతా ప్రత్యేకంగా  మూడు గ్రూపులకు సంబంధం లేకుండా సేవ్ టీడీపీ నినాదంతో తెలుగుదేశం పార్టీని కాపాడాలని కోరుతున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టి.. జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును కలిసేందుకు వీరి ప్రయత్నించారు.  కల్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతచౌదరి, ఇన్ ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, ఇంకో వర్గం మధ్య విబేధాలు తీవ్రంగా ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారు చేపడుతున్నారు. కలిసి పని చేయడం లేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉంటోంది.  అందుకే  కళ్యాణదుర్గం నియోజక వర్గానికి చంద్రబాబు ఎవరినో ఒక నాయకుడిని ప్రకటించి పార్టీ కాపాడాలని తెలుగు యువత నేతలు పట్టుబడుతున్నారు. 


సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !


ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరూ సీనియర్లే ఉన్నారు. అందరూ ఎవరికి వారు పట్టుదలతో  పార్టీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరికీ సర్దుబాటు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఎవరికి హెచ్చరికలు జారీ చేస్తే ఎలాంటి సమస్య వస్తుందోనని సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీ నేతలు మాత్రం.. తమలోతాము కలహించుకుంటే మొదటికే మోసం వస్తుందన్న సంగతిని మర్చిపోతున్నారు. ఫలితంగా పార్టీ గాడిలో పడటం లేదు. 



జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం






చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలోనూ ఈ నేతలు సమన్వయం చేసుకోలేదు. ఎవరికి వారు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. ఈ క్రమంలో సేవ్ టీడీపీ నినాదంతో తెలుగు యువత నేతలు ఉద్యమం లాంటి నిరనస ప్రారంభించడంతో సీనియర్ నేతలు ఉలిక్కి పడ్డారు. జిల్లా పర్యటనలో చంద్రబాబు పార్టీ సీనియర్లకు ఏమైనా దిశానిర్దేశం చేస్తారో లేదో స్పష్టత లేకుండా పోయింది. చంద్రబాబు పర్యటన తర్వాత పరిస్థితుల్లో మార్పు రాకపోతే.. ఇబ్బందేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.