Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Cannes Film festival 2021: ALMARA బై అరుణ గౌడ్... యాదాద్రి టు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రతి డిజైనర్ తన దుస్తులు ప్రపంచమంతా చూడాలని, అందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్నే అందుకుంది మన తెలుగు డిజైనర్ అరుణ గౌడ్. అరుణ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ అయిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవకాశం దక్కించుకున్న మొదటి భారత డిజైనర్ మాత్రం మన అరుణే. రెండు నెలలపాటు కష్టపడి డిజైన్ చేసిన లావెండర్ రంగు డ్రెస్‌ని 21 ఏళ్ల ఫ్రెంచ్ మోడల్, యాక్టర్ నటాషా ధరించి హొయలు పోయింది.
ఫ్యాషన్స్ రంగంపై ఆసక్తి ఉన్న అరుణ బీటెక్ తర్వాత ఏడాదిపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసి మానేసి... ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థలో చేరి డిప్లమో పూర్తి చేసింది.
సెలెబ్రెటీలు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్ ఇలా చాలా మందికి వ్యక్తిగత స్టైలిష్ట్‌గా పని చేస్తోంది అరుణ. రెండేళ్ల కిందట ఫెమీనా మిస్ ఇండియా పోటీదారుకి దుస్తులు డిజైన్ చేసింది.
డిజైనర్ అరుణ గౌడ్ ‘అల్మారా’ లేబుల్ బ్రాండ్ సృష్టికర్త. కొన్నేండ్లుగా వివిధ ఫ్యాషన్ వీక్స్‌లో పాల్గొంటున్నారు. ఇండో- వెస్టర్న్, బ్రైడల్ వేర్ అరుణ ప్రత్యేకతలు.
Almara బై అరుణ గౌడ్ అంటూ సొంత ష్యాషన్ లేబుల్ ప్రారంభించింది. హైదరాబాద్, గోవాల్లో స్టోర్లు తెరిచింది. ‘ఇండియన్ గ్లామ్ ఫ్యాషన్ వీక్’పేరుతో ఏడాదికోసారి ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తోంది.
బిజినెస్ మింట్ నేషన్ వైడ్ అవార్డు నుంచి బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఇండస్ట్రీ (టీసీఈఐ) నుంచి ఉత్తమ ఫ్యాషన్ ఆర్గనైజర్‌గా గుర్తింపు పొందింది.
ప్రతి ఒక్కరినీ మెప్పించేలా డిజైన్ చేయడమే నాకిష్టం. వ్యక్తిగతంగా నేను దృష్టి పెట్టేది బ్రైడల్ కలెక్షన్స్’ అంటూ తన విజయ రహస్యం చెబుతుంది అరుణ.